ఇంత పొట్టి ఆవును మీరెప్పుడైనా చూశారా?

బంగ్లాదేశ్‌లో రాణి అనే ఆవు కేవలం రెండు అడుగుల పొడవు ఉంది.

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం 'రాణి' ఓ సెలబ్రిటీ అయిపోయింది. రాణిని చూడ్డానికి, పక్కనే నిల్చుని ఫొటోలు దిగడానికి వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివస్తున్నారు.

రాణి అంటే మరెవరో కాదు. అదొక 'భుట్టి ఆవు. అంటే భూటాన్ జాతి ఆవు. దాని వయసు రెండు సంవత్సరాలు. ఎత్తు కేవలం 51 సెం.మీ, బరువు 28 కిలోలు. ప్రస్తుతం రాణి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు దగ్గర్లో ఉన్న చారీగ్రామ్‌లోని ఒక ఫామ్ హౌస్‌లో ఉంది.

బంగ్లాదేశ్‌లో కరోనా నిబంధనలు ఉన్నప్పటికీ, 15వేల మందికి పైగా జనం రాణిని చూడ్డానికి వచ్చారని స్థానిక మీడియా తెలిపింది.

ఈ ఫామ్ మేనేజర్ హసన్ హోలాదార్, రాణి పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపారు. రాణి ప్రపంచంలోనే అతి చిన్న ఆవు అని ఆయన అంటున్నారు.

"నా జీవితంలో ఇలాంటి వింత చూడలేదు" అని ఈ బుజ్జి ఆవును చూడ్డానికి వచ్చిన రీనా బేగం బీబీసీతో అన్నారు.

ఈ బుజ్జి ఆవుతో ఫొటోలు దిగడం కోసం జనం తరలి వస్తున్నారు

ఎలా వచ్చింది?

బంగ్లాదేశ్‌లోని నౌగావ్ జిల్లాలోని ఒక ఫామ్ నుంచి కిందటి ఏడాది హసన్ హోలాదార్ రాణిని తీసుకువచ్చారు.

"రాణికి నడవడంలో కాస్త ఇబ్బంది ఉంది. అందుకే ఫామ్‌లో మిగతా ఆవులతో కాకుండా విడిగా ఉంచుతున్నాం. పెద్ద ఆవులు దానికి హాని కలిగిస్తాయేమోనని మాకు భయమేస్తుంటుంది" అని హసన్ హోలాదార్ చెప్పారు.

"రాణి పెద్దగా తినదు కూడా. కొంచం గడ్డి తింటే చాలు దాని కడుపు నిండిపోతుంది. దాన్ని వ్యాహ్యాళికి బయటకి తీసుకెళితే చాలా సంతోషంగా గంతులు వేస్తుంది. కానీ దాన్ని ఎవరైనా చేతుల్లోకి ఎత్తుకుంటే మాత్రం దానికి నచ్చదు" అన్నారాయన.

రాణి పేరును గిన్నిస్ బుక్‌కు పంపించారు

వరల్డ్ రికార్డు అవుతుందా?

ఇప్పటి వరకు ప్రపంచంలో అతి చిన్న ఆవుగా భారత దేశానికి చెందిన 'మాణిక్యం' గుర్తింపు పొందింది. ఈ ఆవు ఎత్తు 61.1 సెం.మీ. మాత్రమే.

ఈ సంవత్సరమే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం రాణిని చూడ్డానికి వస్తారని, "ప్రపంచంలోనే అత్యంత చిన్న ఆవు" అనే గుర్తింపు రాణికి ఇవ్వాలో, వద్దో నిర్ణయిస్తారని హసన్ హోలాదార్ చెప్పారు.

ముస్లింల పండుగ ఈద్ దగ్గర్లోనే ఉండడంతో రాణిని బలి కోసం అమ్మేస్తారేమోనని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, తనకు అలాంటి ఉద్దేశాలేమీ లేవని హసన్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+