అలాస్కాలో 8.1 తీవ్రతతో భూకంపం.. సునామీ ముప్పు..?
అలాస్కాలో భారీ భూకంపం వచ్చింది. బుధవారం 8.1 తీవ్రతతో ప్రకంపనాలు వచ్చాయి. దీంతో హవాలీకి సునామీ ముప్పు పొంచి ఉందని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది. నిన్న రాత్రి 8.16 గంటలకు భూకంపం వచ్చింది. ఎక్కువ తీవ్రత భూకంపం రావడంతో సునామీ థ్రేట్ ఉందని వివరించింది.

గురువారం అర్ధరాత్రి 12.53 గంటలకు సునామీ కదలికలు కనిపించాయని అధికారులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. సునామీ వార్నింగ్ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు.












Click it and Unblock the Notifications