నదిలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు దుర్మరణం.. ఎక్కడంటే ?
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. హడ్సన్ నది మీదుగా ప్రయాణిస్తున్న ఓ పర్యాటక హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో జర్మనీకి చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈఓ అగస్టిన్ ఎస్కోబార్, ఆయన భార్య, ముగ్గురు పిల్లలతో పాటు పైలట్ దుర్మరణం చెందారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఓకే ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలవ్వడం తీవ్రవిషాదాన్ని నింపుతోంది.
ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న బెల్ 206 హెలికాప్టర్ నదిపై గింగిరాలు తిరుగుతూ ఒక్కసారిగా తలకిందులుగా పడిపోయింది. అనంతరం మంటలు చెలరేగాయి. హెలికాప్టర్ పూర్తిగా నీటిలో కూరుకుపోవడంతో అందులో ఉన్న ఆరుగురూ అక్కడికక్కడే మృతిచెందారు.

ఈ హెలికాప్టర్‌ను న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ కంపెనీ పర్యాటకుల కోసం వినియోగించేదిగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు బోట్ల సాయంతో తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాయి. హెలికాప్టర్ గాల్లో ఉండగానే దాని యొక్క ఒక భాగం విరిగిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
JUST IN: 6 people are confirmed to be deceased in the Hudson River helicopter crash, according to the Associated Press.
— Collin Rugg (@CollinRugg) April 10, 2025
The chopper's propeller was seen detached from the helicopter, spinning into the water.
According to a witness who spoke with NBC, the chopper blade just… pic.twitter.com/EMpWMJC9el
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications