భారత్ ను వీడుతున్న 3,500 మంది "కుబేరులు".. ఇన్ని వందల కోట్లు విదేశాలకు..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మిలియనీర్లు వలసలు అధికం అవుతున్నాయి. ఓ పక్క భారత్ లో మిలియనీర్ల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. మరోవైపు కుబేరులు దేశాన్ని వీడుతున్న సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. 2014 నుంచి 2024 మధ్యలో భారత్ లో 72 శాతం మంది మిలియనీర్లు అయ్యారు. కానీ వాళ్లు దేశాన్ని విడిచి విదేశాలకు చెక్కేస్తున్నారు.

భారత్ లో పుట్టి పెరిగి.. ఇక్కడే చదువు, ఉద్యోగం పొంది కోట్లు సంపాదించుకుని చివరికి దేశాన్ని విడిచివెళ్లిపోతున్నారు. దర్జాగా విదేశాల్లో సెటిల్ అవుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. 014 నుంచి 2024 మధ్యలో భారత్ లో 72 శాతం మంది మిలియనీర్లుగా ఎదిగినట్లు హెన్లీ అండ్ పార్ట్ నర్స్ సంస్థ ఓ నివేదిక లో పేర్కొంది. అయితే మిలియనీర్లు విదేశాలకు వెళ్తున్న సంఖ్య కూడా భారీగానే ఉంది. కానీ గత రెండు మూడేళ్లతో పోల్చితే మాత్రం విదేశాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది.

హెన్లీ సంస్థ రిపోర్టు ప్రకారం 2025 లో భారత్ ను వీడనున్న మిలియనీర్ల సంఖ్య 3,500 గా ఉంది. అయితే వీరి సంఖ్య గత రెండు మూడేళ్లతో పోల్చితే మాత్రం తక్కువగానే ఉంది. 2023లో 5,100 మంది మిలియనీర్లు భారత్ ను వీడారు. ఇక 2024లో భారత్ ను వీడిన కుబేరుల సంఖ్య 4,300గా ఉంది. ఈ ట్రెండ్ పరిశీలిస్తే భారత్ ను వదిలి వెళుతున్న మిలియనీర్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.

Henley amp amp Partners 3 500 Indian Millionaires to Relocate by 2025

హెన్లీ రిపోర్టు ప్రకారం వెల్త్ మైగ్రేషన్ 26.2 బిలియన్ డాలర్లు ఉన్నట్లు అంచనా. 2014 నుంచి 2024 మధ్యలో భారత్ మిలియనీర్లు 72శాతం పెరగడం విశేషం. ఇక ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2025 లో ఒక లక్షా 42 వేల మంది మిలియనీర్లు తమ సొంత దేశాలు వదిలి కొత్త దేశాలకు వలస వెళ్తున్నట్లు సమాచారం. 2026 నాటికి మరో లక్షా 65 వేల మంది సొంత దేశాలను వదిలి ఇతర దేశాలకు వలస వెళ్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. వీళ్లంతా ఎక్కువగా యూఏఈ, అమెరికా దేశాలకు వెళ్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+