వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటమి బాధిస్తోంది, కానీ: హిల్లరీ క్లింటన్ ఉద్వేగం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో నిలిచి, ఫేవరేట్‌గా ఉండి అనూహ్యంగా ఓడిన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఫలితాల అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి.. నవ్వుతూ, ఆ తర్వాత ఉద్వేగంగా మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ నుంచి పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.

ఫలితాలు విడుదలైన తర్వాత భర్త బిల్ క్లింటన్‌, కూతురు చెల్సియా క్లింటన్‌, ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్‌ కైన్‌లతో కలసి హిల్లరీ క్లింటన్ మీడియాతో మాట్లాడారు. హిల్లరీ నవ్వుతూ ప్రసంగం ప్రారంభించారు. ఓటమిని అంగీకరిస్తూ పలుమార్లు ఉద్వేగానికి గురయ్యారు.

హిల్లరీకి మరో షాక్, రేసులోకి మిచెల్లి ఒబామా! ట్రంప్‌కు పుతిన్ గ్రీటింగ్స్ హిల్లరీకి మరో షాక్, రేసులోకి మిచెల్లి ఒబామా! ట్రంప్‌కు పుతిన్ గ్రీటింగ్స్

అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అని, అధికార మార్పును తన మద్దతుదారులంతా శాంతియుతంగా ఆహ్వానించాలని కోరారు. ఇప్పటికీ అమెరికా పట్ల తనకు నమ్మకముందని, ఎప్పటికీ ఉంటుందన్నారు. మీకు కూడా అదే విధంగా నమ్మకముంటే ఫలితాలను అంగీకరించి, భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు.

Hillary Clinton delivers concession speech

మీరు ఎంత నిరాశ చెందారో తనకు తెలుసునని, తాను కూడా అంతే నిరాశ చెందానన్నారు. ఓటమి తనను బాధిస్తోందని, బాధ చాలా కాలం ఉంటుందన్నారు. అయినప్పటికీ అమెరికా అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు.

హిల్లరీ ఆల్‌ ద లిటిల్‌ గర్ల్స్ అంటూ అమ్మాయిలను ఉద్దేశించి మాట్లాడారు. మీరు చాలా విలువైన, శక్తిమంతమైన వారని, ప్రపంచంలో ఎలాంటి అవకాశాన్నైనా అందిపుచ్చుకోగలరని, మీ కలలను నెరవేర్చుకోవడానికి తప్పక అవకాశముంటుందన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు.

English summary
Hillary Clinton addressed supporters in New York hours after conceding the 2016 presidential election to Donald Trump in a shocking turn of events.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X