పాకిస్తాన్ లో హిందూ డాక్టర్ కాల్చివేత
కరాచీ: పాకిస్తాన్ లో మతం పేరుతో భారతీయులపై దాడులు జరుగుతున్నాయి. అమాయకులను అతి దారుణంగా చంపేస్తున్నారు. ఇంటికి బయలుదేరిన ఓ హిందూ వైద్యుడి మీద దాడి చేసిన దుండగులు అతి కిరాతకంగా కాల్చి చంపేశారు.
కారాచీలో డాక్టర్ ప్రీతమ్ దాస్ (56) అనే వైద్యుడు హత్యకు గురైనాడు. పోలీసు అధికారి మహమ్మద్ కథనం మేరకు కారచీలోని లఖ్వానీ గార్డెన్ ఈాస్ట్ ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుంచి డాక్టర్ ప్రీతమ్ క్లీనిక్ నిర్వహిస్తున్నాడు.
ఈ పరిసర ప్రాంతంలో ఎక్కువ మంది నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఇంటికి వెల్లడానికి క్లీనిక్ నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో దుండగులు ప్రీతమ్ మీద దాడి చేసి అతి దారుణంగా కాల్చి చంపేశారు.

తరువాత ఆయన సెల్ ఫోన్ నుంచి వారి ఇంటికి ఫోన్ చేశారు. ప్రీతమ్ హత్యకు గురైనాడని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘనా స్థలానికి చేరుకున్నారు.
ప్రీతమ్ కు ఎవ్వరితోనూ పాతకక్షలు లేవని, ఆయన అందరితో కలిసిమెలసి ఉంటారని, గతంలో ఎలాంటి బెదిరింపులు రాలేదని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత వారం కరాచీ ఆసుపత్రిలో డాక్టర్ అనీల్ కుమార్ (32) అనుమానస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. హిందువులు అంటే గిట్టని వారు ప్రీతమ్ దాస్ ను హత్య చేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ












Click it and Unblock the Notifications