Hormuz Firing: మాకు అనుమతిచ్చి కాల్పులా ? భారత నౌక నుంచి వెళ్లిన కాల్ లీక్..!

లెబనాన్ పై ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత హార్ముజ్ జలసంధిని (strait of hormuz) పూర్తిగా తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ (iran).. ఆ తర్వాత ట్రంప్ హార్ముజ్ పై తమ దిగ్బంధం కొనసాగుతుందని చేసిన ప్రకటనతో యూటర్న్ తీసుకుంది. హార్ముజ్ లో ప్రవేశించే నౌకలపై కాల్పులు జరపడం ప్రారంభించింది. ఇందులో భాగంగా భారత్ కు వెళ్తుున్న రెండు నౌకలపై (indian ships) ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కాల్పులు జరిపారు. ఇలా కాల్పులు జరుపుతున్న క్రమంలో అందులోని భారతీయ నావికులు ఇరాన్ కు పంపిన అత్యవసర సందేశం ఆడియో బయటపడింది.

రంగంలోని భారత్.. ఇరాన్ కు సీరియస్ వార్నింగ్..
రంగంలోని భారత్.. ఇరాన్ కు సీరియస్ వార్నింగ్..

నిన్న ఇరాన్ గన్‌బోట్లు కాల్పులు జరపడంతో భారత జెండా ఉన్న రెండు ట్యాంకర్లు వెనక్కి తిరిగి వెళ్లాయి. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని, నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే కాల్పుల సమయంలో నెలకొన్న గందరగోళాన్ని బయటపెట్టేలా.. ఆ ట్యాంకర్లలో ఒకదాని నుండి వచ్చిన ఒక ఆపద సందేశం ఇప్పుడు బయటికి వచ్చింది. సముద్ర రవాణాను పర్యవేక్షించే 'ట్యాంకర్ ట్రాకర్స్' అనే సంస్థ షేర్ చేసిన సుమారు 30 సెకన్ల ఆడియోలో, 'సన్మార్ హెరాల్డ్' అనే ముడి చమురు ట్యాంకర్‌లోని సిబ్బంది ఒకరు ఇరాన్ నావికాదళంతో సంభాషించడానికి ప్రయత్నించారు.

Hormuz Firing Distress Audio From Indian Ship Raises Questions Over Clearance Given
హార్మూజ్ ను దాటే నౌకలను పేల్చేస్తున్న ఇరాన్.. భారత్ కు చెందిన 15 నౌకలు..!!
హార్మూజ్ ను దాటే నౌకలను పేల్చేస్తున్న ఇరాన్.. భారత్ కు చెందిన 15 నౌకలు..!!

"సెపా నేవీ. సెపా నేవీ. ఇది మోటార్ ట్యాంకర్ సన్మార్ హెరాల్డ్. మీరు నాకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. మీ జాబితాలో నా పేరు రెండవది. మీరు ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. నన్ను వెనక్కి తిరగనివ్వండి," అని ఆ వ్యక్తి చెబుతున్నట్లు వినబడింది. తాము రికార్డ్ చేసిన ఫుటేజ్‌ను ఉటంకిస్తూ, ఆ నౌక జలసంధిలోని 'గ్రీన్ ఏరియా'లో ఉందని అమెరికన్ బ్రాడ్‌కాస్టర్ ఎన్బీసీ కూడా నివేదించింది. ఆ ట్యాంకర్ తూర్పు దిశగా వెళుతున్నప్పుడు తన ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS)ను ఆపివేసి, తూర్పు వైపుకు రాగానే దాన్ని తిరిగి ఆన్ చేసింది. కాల్పులకు గురైన మరో నౌకను జగ్ అర్నవ్‌గా గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+