వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మామూలు 'షాక్' కాదు.. ఊహకందని రీతిలో ప్రాణాలతో బయటపడ్డాడు..

దాదాపు 100 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తున్న ఓ విద్యుత్ టవర్ ను ఒక వ్యక్తి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా అతనికి షాక్ తగలడంతో అంతెత్తు నుంచి అమాంతం కిందపడిపోయాడు.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: పొరపాటున ఏ చిన్న ఎలక్ట్రిక్ వైర్ తాకితేనే.. షాక్ తో విలవిల్లాడిపోతాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 30వేల వోల్ట్స్ విద్యుత్ ప్రసరించే హైటెన్షన్ వైర్ తగిలినా ప్రాణాలతో బతికి బట్టకలిగాడంటే నమ్మగలుగుతారా?. కానీ నమ్మి తీరాల్సిందే.

కేవలం విద్యుత్ షాక్ మాత్రమే కాదు.. ఆ షాక్ తో అతను దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయాడు. అయినా అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది లాంటి వివరాల పట్ల స్పష్టత లేకపోయినప్పటికీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కాగా, 100 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తున్న ఓ విద్యుత్ టవర్ ను ఒక వ్యక్తి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా అతనికి షాక్ తగలడంతో అంతెత్తు నుంచి అమాంతం కిందపడిపోయాడు. రోడ్డున వెళ్తున్నవారు దీన్ని తమ మొబైల్ ఫోన్స్ ద్వారా చిత్రీకరించారు. అతను అక్కడిక్కడే చనిపోయి ఉంటాడని అంతా భావించినా.. కాలిన గాయాలతో అతను తన ప్రాణాలు దక్కించుకున్నాడు.

చర్మం ఊడిపోతున్న స్థితిలోను ఓవైపు బాధతో అరుపులు పెడుతూనే స్థిరంగా నడవడం మొదలుపెట్టాడు. ఘటనపై నెటిజెన్స్ పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

English summary
The horrific footage, taken on a mobile phone, shows the man perched on the second branch of the huge pylon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X