చైనా సరిహద్దు తూర్పు తజకిస్తాన్‌లో భారీ భూకంపం.. టర్కీ, సిరియాల ప్రకృతి ప్రకోపం మరచిపోకముందే!!
టర్కీ, సిరియాల ప్రకృతి ప్రకోపం మరచిపోకముందే చైనా సరిహద్దులో తూర్పు తజకిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది.
చైనాలోనూ ,తూర్పు తజకిస్తాన్ ప్రాంతంలోనూ భారీ భూకంపాలు సంభవించాయి. చైనాలో నిన్న రాత్రి సంభవించిన భూకంపం రిక్టరు స్కేలుపై 7.2 తీవ్రతతో నమోదు కాగా, తాజాగా మరో మారు చైనా సరిహద్దుకు సమీపంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 6. 8 గా నమోదయింది. 6.8 తీవ్రతతో ఈ భూకంపం తజకిస్తాన్ కు తాకింది.

చైనాలోనూ, తూర్పు తజకిస్తాన్ లోనూ భూకంపాలు
చైనాలోని పశ్చిమ జింజియాంగ్ ప్రాంతానికి సమీపంలోని తూర్పు తజకిస్తాన్లో నేడు తీవ్ర భూకంపం సంభవించినట్టు యూఎస్ బయోలాజికల్ సర్వే తెలిపింది. దీంతో చైనా, తూర్పు తజకిస్తాన్ లు వణికిపోయాయి. మొన్న టర్కీ, సిరియాలలో భూకంప విధ్వంసాన్ని, సృష్టించిన విలయాన్ని మర్చిపోకముందే వరుసగా అనేక దేశాలు భూ ప్రకంపనలకు లోను కావడం ఆందోళన కలిగిస్తుంది.

నిన్న భారత్ ను టెన్షన్ పెట్టిన భూకంపాలు
నిన్న భారతదేశంలోని దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు టెన్షన్ పుట్టించాయి. దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు రాజధాని పరిధిలోని అనేక ప్రాంతాల్లో, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం భూ ప్రకపంనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 4.4గా తీవ్రత నమోదైంది. ఇక తాజాగా చైనా, తజకిస్తాన్ ప్రాంతాలు భూకంపాలతో టెన్షన్ పడుతున్నాయి.

చైనాలో 7.3 తీవ్రత, తూర్పు తజకిస్తాన్ లో 6.8 తీవ్రత
భూకంపం తజకిస్తాన్లోని ముర్గోబ్ పశ్చిమాన 67 కిలోమీటర్లు, పొడవు 20 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు సర్వే పేర్కొంది. ఈ భూకంపం 7.2 తీవ్రతతో పది కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు చైనా భూకంప నెట్వర్కుల కేంద్రం వెల్లడించింది. మొన్నటికి మొన్న టర్కీ, సిరియాలు భూకంపం కారణంగా అతలాకుతలం కాగా చైనాలో నిన్న రాత్రి జిన్ జియాంగ్ ప్రాంతంలో 7.2 తీవ్రతతో, మరోవైపు చైనా సరిహద్దు ప్రాంతమైన తూర్పు తజకిస్తాన్లో 6.8 తీవ్రతతో భూకంపాలు రావడం ఆందోళన కలిగిస్తుంది. భారీగా ఆస్తి నష్టం , ప్రాణ నష్టం సంభవించి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చైనాలో భారీ నష్టం జరిగి ఉంటుందని అంచనా
తజకిస్తాన్ లో భూకంపం వచ్చిన ప్రాంతంలో భారీ పామీర్ పర్వత శిఖరాలు ఉన్నాయి. దీంతో అక్కడ కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే పెద్దగా అక్కడ జనావాస ప్రాంతాలు లేకపోవడంతో ప్రాణ నష్టం , ఆస్తి నష్టం పెద్దగా సంభవించదని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు చైనాలో సంభవించిన భూకంపంపై స్పష్టమైన సమాచారం అందడం లేదు.












Click it and Unblock the Notifications