ఫ్లోరిడాలో హరికేన్ మిల్టన్ బీభత్సం: నలుగురు మృతి, అంధకారంలో లక్షలాది మంది
అమెరికాలోని ఫ్లోరిడాలో హరికేన్ మిల్టన్ విధ్వంసం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, విపరీతమైన ఈదురుగాలు, టోర్నడోలు విరుచుకుపడటంతో ఫ్లోరిడా మొత్తం అస్తవ్యస్థమైంది. లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. హరికేన్ మిల్టన్ కారణంగా విద్యుత్ వ్యవస్థ పూర్తి స్థంభించిపోయింది. దీంతో లక్షలాది మంది అంధకారంలోనే జీవనం కొనసాగిస్తున్నారు. హరికేన్ విధ్వంసంతో తాజాగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
దాదాపు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో సుమారు 10 లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను కారణంగా 2 వేలకుపైగా విమానాలు రద్దయ్యాయి. వందలాది నివాసాలు, భవనాలు, ఇతర వాణిజ్య సముదాయాలు తుఫాను కారణంగా ధ్వంసమయ్యాయి. హరికేన్ మిల్టర్ ప్రభావంతో అనేక బోట్లు నివాసాల్లోకి కొట్టుకువచ్చాయి.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. హరికేన్ మిల్టన్ ప్రభావంపై నిరంతరం సమీక్షిస్తున్నారు. కాగా, రెండు వారాల క్రితం హెలెన్ హరికేన్ అమెరికాలో విధ్వంసం సృష్టించగా.. ఇప్పుడు హరికేన్ మిల్టన్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఈ తుఫాను రద్దీగా ఉండే ఫ్లోరిడాలోని టంపా బే వైపునకు కదులుతోంది. వెస్ట్ సెంట్రల్ ఫ్లోరిడాను తాకిన అత్యంత విధ్వంసకర హరికేన్‌లలో మిల్టన్ ఒకటిగా మారవచ్చని అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది.
Aftermath - Hurricane Milton 🌀 Tornadoes 🌪 #Wellington #Milton #Siestakey #HurricanMilton #HurricaneMilton #hurricanemilton2024 #Hurricane #Florida #Tampa #Sarasota #Naples #FortMyers #TampaBay pic.twitter.com/UEVS5PPJ1P
— Breaking News Worldwide (@FelizKarenP1) October 10, 2024
హరికేన్ మిల్టన్ ప్రస్తుతం ఫ్లోరిడాకు సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండి గల్ఫ్ ఆఫ్ మెక్సికోను దాటుతోంది. అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం.. ఈ తుఫాను ఫేజ్ 5 కేటగిరి ప్రమాదంలో ఉంచారు. ఇది మరింత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుందని పేర్కొంది. అయితే, ఇది టంపాకు చేరుకున్న తర్వాత బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఇది అట్లాంటిక్ సముద్రం వైపు కదులుతుంది. దీంతో ఫ్లోరిడాకు పెను ముప్పు తప్పినట్లే అవుతుందని అంచనా వేస్తున్నారు.
AMAZING
— Batu Han (@19BaTHaN19) October 10, 2024
Several boats were stranded inland due to the rising sea levels caused by Hurricane #Milton.#MiltonFloridapic.twitter.com/bDEJgMbUFV
హరికేన్ మిల్టన్ ప్రభావిత తీర ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో ఐదు లక్షల మందిని తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, రెండు వారాల క్రితం హెలెన్ హరికేన్ అమెరికాలో విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా 225 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మిల్టన్ హరికేన్ విరుచుకుపడుతుండటంతో ఫ్లోరిడా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ప్రజలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని బైడెన్ చెబుతున్నారు.
Hurricane #Milton tears through #Florida, leaving destruction behind pic.twitter.com/hhqLu4uDLh
— VA-EHV1team1taak (@anticovidiano74) October 10, 2024
Hurricane Milton tore off part of the roof at Tropicana Field in St. Petersburg, Florida. Tropicana Field, home to MLB's Tampa Bay Rays, suffered significant damage during the storm. pic.twitter.com/6Z3l3nOEHZ
— BùTtęrß Tøó 🇺🇸 (@ButtersToo2) October 10, 2024
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications