దారుణం: అమెరికా అధ్యక్ష రేసు... తులసీ గబ్బార్డ్ హిందూజాతీయ ముద్రవేసే ప్రయత్నం
వాషింగ్టన్: వచ్చే అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష బరిలో నిలవాలని అనుకుంటున్న హవాయి డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి తులసీ గబ్బార్డ్‌కు చేదు అనుభవం ఎదురవుతోంది. మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయట. తాను హిందూ జాతీయురాలిని అయినందుకు విమర్శలు వస్తున్నాయని ఆమె వాపోయారు.
అంతేకాదు, భారత ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకోవడాన్ని కూడా తప్పుబడుతున్నారని తులసి వాపోతున్నారు. తనకు, తన మద్దతుదారులకు మతం రంగు పులిమి తమ పైన హిందూ జాతీయవాదులన్న ముద్ర వేస్తున్నారని తులసీ గబ్బార్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందూ మహిళగా పేరొందిన తులసీ గబ్బార్డ్ 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ఈ నెల 11వ తేదీన ప్రకటించారు. తాను భారత ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్న విషయాన్ని భూతద్దంలో చూపి తనపై మతం ముద్ర వేస్తున్నారన్నారు.
అమెరికా చట్టసభలకు ఎన్నికైన తొలి హిందువును తాను అయినందుకు గర్విస్తున్నానని తులసీ గబ్బార్డ్ తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న తొలి హిందువును అయినందుకు కూడా గర్వంగా ఉందని చెప్పారు.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మోడీని కలుసుకున్నారని ఆమె గుర్తు చేస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్ష బరిలో నిలిచేందుకు పోటీపడుతున్న మరో భారత సంతతి మహిళ, సెనేటర్ కమలాహారిస్ ఆదివారం ప్రచారాన్ని ప్రారంభిస్తూ ట్రంప్ విధానాలపై విమర్శలు గుప్పించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications