'నన్ను కిడ్నాప్ చేశారు.. నేను ఏ తప్పూ చేయలేదు'.. కోర్టులో మదురో ఆవేదన

జనవరి 3న వెనిజులాపై అమెరికా సైన్యం దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను కస్టడీలోకి తీసుకుంది అమెరికా సైన్యం. అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్‌ ఈ ఆపరేషన్‌ చేపట్టింది. అయితే తాజాగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను అధికారులు న్యూయార్క్ లోని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో వాదనలు వినిపిస్తూ.. తాను ఏ తప్పూ చేయలేదని.. తనను కిడ్నాప్ చేశారని మదురో జడ్జి ముందు వాపోయారు. తాను చాలా డీసెంట్ వ్యక్తి అని ఓ దేశానికి అధ్యక్షుడిని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను న్యూయార్క్ సిటీ కోర్టులో అధికారులు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో తాను ఏ తప్పు చేయలేదని మదురో ఆవేదన వ్యక్తం చేశారు. తాను చాలా డీసెంట్ వ్యక్తి అని.. ఇప్పటికీ వెనిజులా అధ్యక్షుడినని చెప్పుకున్నారు. ఫెడరల్ అధికారులు తనపై మోపిన డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలు అవాస్తవం అని తాను ఏ తప్పు చేయలేదని మదురో కోర్టు ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. మదురోపై ఉన్న నార్కో టెర్రరిజం ఆరోపణలను జడ్జి ఆల్విన్ హెల్లర్ స్టీన్ చదివి మదురోకు వినిపించగా.. అందుకు మదురో సమాధానం ఇస్తూ.. తాను నిర్దోషినని.. తనకు ఏమీ తెలియదని జవాబు ఇచ్చారు.

I Was Kidnapped Maduro s Anguished Cry in US Court Pleads Not Guilty

ఇదే విషయాన్ని మదురో భార్య సిలియా ఫ్లోర్స్ ను జడ్జి అడిగిన క్రమంలో.. ఆమె కూడా.. తాను ఏ తప్పు చేయలేదని.. కంప్లీట్ గా ఇన్నోసెంట్ అని జవాబు ఇచ్చారు. మరోవైపు తనను తాను వెనిజులా అధ్యక్షుడిగా జడ్జికి పరిచయం చేసుకున్నారు మదురో. తాను ఇప్పటికీ ఆ దేశ అధ్యక్షుడినే అని పేర్కొన్నారు. తనను బలవంతంగా కిడ్నాప్ చేశారని మదురో పేర్కొన్నారు. అయితే మదురో సమాధానంతోపాటు ఫెడరల్ అధికారులు మదురోపై మోపిన అభియోగాలను క్షుణ్ణంగా పరిశీలించిన జడ్జి ఆల్విన్ హెల్లర్ స్టీన్.. తదుపరి విచారణను మార్చి 17 కు వాయిదా వేశారు. ఇక వెనిజులాపై జనవరి 3 న అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్‌ వైమానిక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+