Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సైన్యంపై ఐఈడీ దాడి: మేజర్‌తో సహా పలువురు జవాన్లు మృతి

సోమవారం పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఓ మేజర్ సహా నలుగురు పాకిస్థాన్ సైనిక జవాన్లు మరణించారు. ఈ దాడిలో మేజర్ కాకర్‌ను లక్ష్యంగా చేసుకుని బీఎల్ఏ ఐఈడీ పేలుడు జరిపి హతమార్చింది. ఈ దాడికి తామే బాధ్యులమని బీఎల్ఏ ప్రకటించింది. మండ్ ప్రాంతంలోని షాంద్‌లో భద్రతా బలగాల వాహనంపై ఐఈడీ పేలుడు సంభవించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను మేజర్ వకార్ కాకర్, నాయక్ జునైద్, నాయక్ ఇస్మత్, లాన్స్ నాయక్ ఖాన్ మహమ్మద్, సిపాయి జహూర్‌గా గుర్తించారు. ఈ వాహనం సాధారణ పెట్రోలింగ్‌లో ఉన్నప్పుడు పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.

వరుస దాడులు.. భద్రతా సవాళ్లు
బలూచిస్తాన్‌లో జరిగిన జరిగిన ఈ దాడి పాకిస్థాన్ లో ఇటీవల చోటుచేసుకున్న వరుస హింసాత్మక ఘటనలలో ఒకటి. సెప్టెంబర్ 6న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో ఒక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఉగ్రదాడిలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడి కూడా ఐఈడీతో జరిగిందని భావిస్తున్నారు. అంతేకాకుండా కే ఒక వారం ముందు, అదే ప్రావిన్స్‌లో ఒక పోలీస్ స్టేషన్‌పై క్వాడ్‌కాప్టర్‌తో దాడి జరిగింది. ఈ ఘటనలో కూడా ఓ పోలీసు, ఒక పౌరుడు గాయపడ్డారు.

IED Attack on Pakistan Army Major and Soldiers Killed in Balochistan

'ఆపరేషన్ సర్బకాఫ్'కు ప్రతీకార చర్యలుగా అనుమానం
ఈ వరుస దాడులు పాకిస్థాన్ బలగాలు ఇటీవల ప్రారంభించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ "సర్బకాఫ్"కు ప్రతీకార చర్యలుగా భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు. గత నెలలో పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఏడు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లు, చెక్‌పోస్టులు, పెట్రోలింగ్ యూనిట్లపై సమన్వయంతో దాడులు చేసి ఆరుగురు అధికారులను హతమార్చింది. ఈ దాడుల వెనుక ఉగ్రవాద సంస్థల ప్రతీకార ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది పాకిస్తాన్ భద్రతకు ఓ పెద్ద సవాలుగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+