వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బ్రెగ్జిట్' ఓటింగ్: ఎందుకు, భారత మార్కెట్లపై ప్రభావం?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

లండన్: ఐరోపా యూనియన్ (ఈయూ)లో బ్రిటన్ కొనసాగనుందా? లేదా తప్పుకోనుందా? ఈ ఉత్కంఠకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇందుకోసం 'బ్రెగ్జిట్ (బ్రిటన్, ఎగ్జిట్ అనే రెండు పదాలను కలిపేదే బ్రెగ్జిట్)' పేరుతో గురువారం రిఫరెండం జరగనుంది. దీని ఫలితాలను శుక్రవారం ఉదయం వెల్లడిస్తారు.

ఈ ఫలితంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు సహా కరెన్సీ మార్కెట్లూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ ఎగ్జిట్) జరిగితే ఆ ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలపై ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

'బ్రెగ్జిట్' గురించి పాఠకులు తెలుసుకోవాల్సిన విషయాలు ప్రత్యేకం:

ఓటింగ్:
గత ఎన్నికల సమయంలో ప్రత్యర్థులకు అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, ఈయూపై రెఫరెండం కోరతామని హామీ ఇచ్చారు. ఈయూ మొత్తం 28 దేశాల కూటమి. ఈ కూటమి నుంచి బ్రిటన్ తప్పుకుంటే తమ జాతి ప్రయోజనాలను కాపాడుకోవచ్చని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఇప్పుడు రిఫరెండం నిర్వహిస్తున్నారు.

రిఫరెండంలో ఎవరెవరు ఓటేస్తారు?
బ్రిటన్, ఐరిష్ జాతీయుల్లో 18 సంవత్సరాలు నిండి, యూకేలో ఉన్న వారు, కామన్వెల్త్ దేశాల్లో ఉన్న యూకే పౌరులు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. విదేశాల్లో నివసిస్తున్న బ్రిటన్ పౌరులు కూడా 'బ్రిగ్జిట్'లో ఓటేయొచ్చు. వీరితో పాటు స్పెయిన్ దక్షిణ తీరంలోని జిబ్రాల్టర్ పౌరులు, హౌస్ ఆఫ్ లార్డ్ సభ్యులు మొత్తం 4,64,99,537 మంది ఓటు వేయనున్నారు.

If UK votes leave in Brexit referendum, pound sterling will likely tumble, dollar surge

బ్యాలెట్ పేపర్‌పై ఏముంది?
యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) యూరోపియిన్ యూనియన్‌ (ఈయూ)లో కొనసాగాలా? లేక తప్పుకోవాలా? అన్న ప్రశ్న మాత్రమే బ్యాలెట్ పేపర్‌పై ఉంటుంది. దీనికి సమాధానంగా ఈయూలో ఉండాలి, ఈయూ నుంచి తప్పికోవాలి అన్న సమాధానాలు దాని పక్కనే ఉన్న చిన్న బాక్సులో ఉంటాయి. ఓటర్ల అభిప్రాయాల మేరకు సమాధానాన్ని ఎంచుకోవాలి.

పోలింగ్ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
ఓటింగ్ పోలింగ్ స్టేషన్లు గురవారం ఉదయం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటలకు) తెరుస్తారు. రాత్రి 10 గంటల వరకూ (భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 2:30) ఇవి అందుబాటులో ఉంటాయి. యూకేలో మొత్తం 382 ప్రాంతాల్లో ఓటింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తి కాగానే అంటే శుక్రవారం ఉదయానికి ఓట్ల లెక్కింపు ఉంటుంది.

పోలింగ్ రోజున కూడా ప్రచారం
యూకే చట్టాల మేరకు పోలింగ్ రోజు కూడా ప్రచారం చేసుకునే వెసులుబాటు ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాల్సి ఉంటుంది. మనదేశంలో మాత్రం ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఎగ్టిట్ పోల్ ఫలితాలను వెల్లడిస్తారు.

శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఫలితాల వెల్లడి
రీజనల్ కౌంటింగ్ ఆఫీసులు, ఓట్లను లెక్కించిన తర్వాత ఫలితాలను మాంచెస్టర్‌కు పంపుతాయి. అక్కడ యూకే ఎలక్షన్ కమిషన్ వాటన్నింటినీ క్రోడీకరించి తుది ఫలితాన్ని శుక్రవారం ఉదయం 7 గంటలకు (భారత కాలమానంలో శుక్రవారం ఉదయం 11:30) వెల్లడిస్తారు. అయితే, మీడియా స్థానిక ఫలితాలను ముందే లెక్కిస్తుంది కాబట్టి తెల్లవారుజామున 4 గంటలకే (ఇండియాలో శుక్రవారం ఉదయం 9:30) ఫలితం వస్తుంది.

'బ్రెగ్జిట్'పై రిఫరండమే తుది నిర్ణయమా?
కాదు. ఇది కేవలం ప్రజల అభిప్రాయం మాత్రమే. ఫలితం ఎలా ఉన్న దానికి పార్లమెంటు తప్పనిసరిగా కట్టుబడివుండాలన్న నిబంధన ఏదీ లేదు. కాకపోతే మెజారిటీ ప్రజల అభిప్రాయానికి కట్టుబడాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది.

బ్రిటన్ ఎందుకు వైదొలగాలని భావిస్తోంది?
యూరోపియన్ యూనియన్‌లో మొత్తం 28 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నింటికి కూడా ఒకే కరెన్సీ ఉంటుంది. ఆయా దేశాలకు చెందిన పౌరులు స్వేచ్ఛగా యూనియన్‌లోని ఏ దేశంలోనైనా పర్యటించొచ్చు.

ఈ క్రమంలో యూనియన్‌లోని మిగతా దేశాలు బ్రిటన్‌కు భారీగా వలసలు రావడం పెద్దగా సమస్యగా మారింది. ఈ పరిణామం బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధపై ప్రభావం చూపుతోంది.

అయితే బ్రిటన్ 'బ్రిగ్జిట్' నుంచి వైదొలగితే దాని ప్రభావం ప్రపంచంలోని మిగతా దేశాలపై కూడా పడనుంది. అయితే ఈ ప్రభావం భారత మార్కెట్లపై పడకుండా ఆర్‌బీఐ, సెబీ, కేంద్రం ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకుంది.

English summary
The Brexit referendum, which will decide whether the U.K. remains in the 28-member trade block, was set to begin Thursday, with results due early Friday local time. Broadly, opinion polls showed the remain and leave camps were neck-and-neck, making the result too close to call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X