Poseidon: ట్రంప్ ను లెక్కచేయని పుతిన్..! ఈసారి అణు ప్రయోగం..!
రష్యా-ఉక్రెయిన్ యుద్దాన్ని విరమింపజేసేందుకు ఓవైపు తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతుండగా.. మరోవైపు దీన్ని కొనసాగించే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ దేశాల ఒత్తిడికి తలొగ్గకుండా వరుసగా అస్త్రాలు సమకూర్చుకుంటున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్.. ఇవాళ మరో అడుగు వేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల్ని లెక్కచేయకుండా పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయం రావణకాష్టాన్ని మరింత రగిల్చేలా కనిపిస్తోంది.
రష్యా ఇవాళ నీటిలో శత్రువులపై దాడి చేసే అణు డ్రోన్ పోసిడాన్ ను విజయవంతంగా పరీక్షించింది. రాబోయే తరం అణ్వస్త్రంగా అభివర్ణిస్తున్న ఈ డ్రోన్ ప్రయోగంతో రష్యా అణ్వస్త్ర దేశాల సరసన తన స్థాయి ఏంటో మరోసారి నిరూపించుకుంది. ఇప్పటికీ అణ్వాయుధాలు తయారు చేసే సత్తా ఉందని చాటుకుంది. తాజాగా రష్యా పరీక్షించిన బురెవెస్ట్నిక్ క్షిపణి విషయంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల్ని రష్యా అస్సలు పట్టించుకోలేని ఈ ప్రయోగం నిరూపిస్తోంది.

ఈ అణు జలాంతర్గామి డ్రోన్ ప్రయోగాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ స్వయంగా ప్రకటించారు. ఈ ప్రయోగం ఇప్పటికే రష్యా వద్ద నున్న సర్మాట్ క్షిపణిని అధిగమిస్తుందని పుతిన్ పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో వారం రోజుల్లోనే రష్యా రెండో ఆయుధ పరీక్ష చేసినట్లయింది. పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు తాము లొంగబోమని ప్రకటించుకోవడమే ఈ పరీక్ష లక్ష్యంగా తెలుస్తోంది. ఓవైపు ఉక్రెయిన్ తో రష్యాకు సీజ్ ఫైర్ చేయించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్న వేళ ఈ ప్రయోగం జరిగింది.

⚡️ Vladimir Putin announces successful tests of 'Poseidon' nuclear-powered underwater drone
— RT (@RT_com) October 29, 2025
Its capabilities 'significantly surpass' the 'Sarmat' missile pic.twitter.com/JZAFMJzbyh
పొసైదాన్ అనేది కొత్త రకాల స్వయం చోదిత అణుశక్తితో పనిచేసే డ్రోన్. ఇది రష్యా తయారు చేసిన అద్భుతమైన డ్రోన్. సముద్రాల లోతుల్లో కూడా వేగంగా ఇది పనిచేయగలదు. ఈ డ్రోన్ వినాశక శక్తి "సర్మాట్" అంతరఖండ మిస్సైల్ కంటే చాలా ఎక్కువగా ఉంటుందని పుతిన్ ప్రకటించారు. ఈ డ్రోన్ ను శత్రువులు అడ్డుకోవడం అసాధ్యమని రష్యా చెబుతోంది. ప్రస్తుత టెక్నాలజీతో దీన్ని గుర్తించడం లేదా ఎదుర్కోవడం సాధ్యం కాదు. సాంప్రదాయ రక్షణ వ్యవస్థలను ఎవరూ ఎదుర్కోలేని విధంగా రాబోయే తరం ఆయుధంగా ఉంచడమే దీని లక్ష్యం.












Click it and Unblock the Notifications