వివాహేతర సబంధం పెట్టుకొందని బెత్తంతో బాదారు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇండోనేషియా :భర్తతో కాకుండా వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొన్న మహిళకు బెత్తంతో కొట్టే శిక్షను విధించారు బెత్తం దెబ్బలు తింూ ఆమె ఏడ్చింది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న వ్యక్తి కి కూడ ఇదే శిక్షను అమలు చేశారు.

ఇండోనేషియాలో ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తారు. ఈ చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన శిక్షలను అమలు చేస్తారు. మద్యం తాగినా, స్వలింగ సంపర్కానికి పాల్పడినా, కఠినమైన శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది. ఇండినేషియా రాజధాని బందే అసేలో కఠినమైన శిక్షలను అమలు చేస్తూంటారు.

illegal affair effects on ladies in indonesia

బందే అసే లోని మసీదు వద్ద ఇద్దరు మహిళలు పురుషులను వివిధ నేరాలు చేసినందుకు కఠినంగా శిక్షించారు. 34 ఏళ్ళ మహిళ భర్తతో కాకుండా వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.ఈ విషయం తెలిసింది. దీంతో ఆమెను బెత్తంతో ఏడుసార్లు అందరూ చూస్తుండగానే కొట్టారు.ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించిన వ్యక్తికి కూడ ఇదే రకమైన శిక్షను అమలు చేశారు.

బెత్తంతో కొట్టిన వ్యక్తిని గుర్తుపట్టకుండా శరీరం మొత్తం కప్పి ఉంచారు. వీరిద్దరితో పాటు ఇద్దరు యూనివర్శిటీ విధ్యార్థులు కూడ పెళ్ళి కాకుండానే లైంగిక సంబంధాలు పెట్టుకొన్నారు. ఈ కారణంగా వారిపై బెత్తం దెబ్బల శిక్షలను విధించారు. వంద చొప్పున బెత్తం దెబ్బలను విధించారు. భార్య గర్భవతి కావడంతో భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. భార్యతో కాకుండా పరాయి స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నందుకుగాను అతనికి 22 బెత్తం దెబ్బలు పడ్డాయి. ఆయన భార్యకు ఎలాంటి శిక్ష విధించలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
indonesia country perfect shariat laws, illegal affair, dirniking habbits punishable. recently who have illegal affairs, governament punish with stick attacks, a lady continues illegal affair another man, so governament punish her.
Please Wait while comments are loading...