భారత్ కు మంట పుట్టిస్తోన్న ట్రంప్- పొల్లు పోకుండా అవే మాటలు: బోర్ కొట్టదా?

Donald Trump: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో చోటుచేసుకున్న ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం పతాక స్థాయికి చేరుకుంది. రెండు దేశాలు దాడులు ప్రతిదాడులకు దిగాయి. డ్రోన్లు, మిస్సైళ్లను సంధించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడంతో కాల్పుల విరమణకు అంగీకరించాయి.

భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి తానే కారణం అని డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. యుద్ధాన్ని కొనసాగించితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని తాను హెచ్చరించానని, దీనితో ఈ రెండు దేశాలు కూడా యుద్ధ విరమణ ప్రకటించాయని ఆయన చెప్పుకొన్నారు.

I m most proud of is the fact that we re dealing with India and Pakistan says Donald Trump

పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తోన్నారు డొనాల్డ్ ట్రంప్. మొన్నటికి మొన్న సౌదీ అరేబియా పర్యటనలో ఇదే విషయాన్ని గుర్తు చేశారు. సందర్భంగా కాకపోయినా కూడా ప్రతిష్ఠాత్మక సౌదీ- యూఎస్ ఇన్వెస్టిమెంట్ ఫోరం సదస్సులో భారత్- పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడారు.

తాజాగా మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తారు. భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు గర్వపడుతున్నానని వ్యాఖ్యానించారు. ఆ రెండు దేశాలతో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో మధ్యవర్తిత్వం వహించడం.. తనకు గర్వకారణమని పేర్కొన్నారు. భారత్- పాకిస్తాన్ ను సమంగా చూస్తోన్నామని, ఈ రెండు దేశాలతో సమానంగా వ్యవహరిస్తోన్నామని చెప్పారు.

బుల్లెట్ల ద్వారా కాకుండా ట్రేడ్ అండ్ టారిఫ్ ద్వారా అణు యుద్ధాన్ని ఆపగలిగామని పేర్కొన్నారు డొనాల్డ్ ట్రంప్. సాధారణంగా ఏ రెండు దేశాలైనా బుల్లెట్ల ద్వారా యుద్ధంలో పాల్గొంటాయని, తాము ట్రేడ్- టారిఫ్ ద్వారా న్యూక్లియర్ యుద్ధాన్ని ఆపివేశామని అన్నారు. భారత్- పాక్ మధ్య అణు యుద్ధాన్ని నిలిపివేయడం తనకు గర్వకారణమని చెప్పుకొచ్చారు.

ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉన్నా ఇది అణు విపత్తుగా మారే ప్రమాదం ఉందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు ట్రంప్. తన మాటకు విలువ ఇచ్చి యుద్ధాన్ని నిలిపివేసినందుకు భారత్- పాకిస్తాన్ లకు కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడం, అణ్వాయుధాలను ఉపయోగించే దేశాలతో వ్యాపారం చేయలేమని స్పష్టం చేశారు.

ఈ రెండు దేశాల్లో గొప్ప నాయకులు ఉన్నారని, తన మాటల తీవ్రతను అర్థం చేసుకుని, కాల్పుల విరమణకు అంగీకరించారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యుద్ధ తీవ్రత కొనసాగుతున్న ఇతర దేశాలతో కూడా చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నామని రష్యా- ఉక్రెయిన్ యుద్ధం గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అమెరికాకు గొప్ప సైన్యం ఉందని పునరుద్ఘాటించారాయన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+