బాలీవుడ్ క్లిప్‌తో ఇమ్రాన్ ఖాన్ పోస్ట్- ట్విట్టర్‌లో కలకలం- ప్రత్యర్ధుల కుట్ర చెప్పేందుకే
పాకిస్తాన్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇదే క్రమంలో ఆయన తాజాగా విపక్షాల నుంచి బలపరీక్ష కూడా ఎదుర్కొన్నారు. ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్నా... ఐక్యత లేకపోవడంతో దాన్ని ఆయన సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను బయటపెట్టే లక్ష్యంతో 1984నాటి బాలీవుడ్ చిత్రం ఇంక్విలాబ్‌లోని ఓ క్లిప్‌ను తన అధికారిక టెలిగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది.

ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర
పాకిస్తాన్‌తో సంకీర్ణ ప్రభుత్వానికి సారద్యం వహిస్తున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓవైపు సైన్యంతో మరోవైపు విపక్షాలతో పోరాడుతున్నారు. ఇదే క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా పలు కుట్రలు జరుగుతున్నట్లు కూడా ఆయన అనుమానిస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటూ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఆయనలో భయం మాత్రం పోలేదు. చివరికి ఈ భయం సోషల్ మీడియాకు కూడా చేరడంతో దేశంలో దీనిపై తీవ్ర చర్చ సాగుతోంది.

టెలిగ్రామ్‌లో ఇమ్రాన్ పోస్ట్
టెలిగ్రామ్‌లోని తన అధికారిక ఖాతాలో తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు. ఈ వీడియో 1984 నాటికి బాలీవుడ్ చిత్రం ఇంక్విలాబ్ లోని క్లిప్ కావడంతో దీనిపై సర్వత్రా చర్చ సాగుతోంది. "పిటిఐ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదటి రోజు నుండి అవినీతి మాఫియా చేత ప్రణాళికా బద్ధమైన కుట్ర జరుగుతంది.." అంటూ ఇందులో ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

ఇమ్రాన్ పోస్ట్ చేసిన ఆ క్లిప్‌లో ఏముంది ?
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోస్ట్ చేసిన ఈ బాలీవుడ్ క్లిప్‌లో ఖాదర్ ఖాన్ అనే అవినీతి రాజకీయ నాయకుడు తన పార్టీ సభ్యులతో ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి అనైతిక మార్గాల గురించి మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఈ వీడియోలోని నటుడి మాటలను ఇమ్రాన్ ఖాన్ తన రాజకీయ ప్రత్యర్థులతో పోల్చారు. తన ప్రత్యర్ధులు కూడా తన ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఇమ్రాన్ సంచలన ఆరోపణలు చేశారు.
ట్విట్టర్‌లో ప్రత్యక్షమైన టెలిగ్రామ్ క్లిప్
పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్ట్ నైలా ఇనాయత్ ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒరిజినల్ వీడియో యొక్క స్క్రీన్ రికార్డింగ్‌ను ట్వీట్ చేశారు, "పిఎం ఇమ్రాన్ ఖాన్‌ను రక్షించడానికి " మంచి బాలీవుడ్ " అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో ఈ వీడియో ట్విట్టర్‌లో మరింత సంచలనమైంది. చివరికి ఇమ్రాన్ ఖాన్ తన ఖాతా నుండి ఈ వీడియోను తొలగించారు. తద్వారా వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అయినా ప్రధాని స్దాయి వ్యక్తి ఇలా సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వెళ్లగక్కడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications