ఆప్ఘన్ లో భారీ ట్విస్ట్-తాలిబాన్లపై అమ్రుల్లా సేనల తిరుగుబాటు-మళ్లీ చారికర్ టౌన్ స్వాధీనం

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వ పాలన ముగిసి తాలిబన్ల శకం ప్రారంభమైనట్లు అంతా భావిస్తున్న తరుణంలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రప్ ఘనీ కాబూల్ ను విడిచి తజకిస్తాన్ పారిపోవడంతోనే ప్రభుత్వం కూలిపోయినట్లు భావించినా... ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ వీరోచిత పోరాటం చేస్తున్నారు. ఆప్ఘన్ ఆర్మీని ఆయన ముందుండి నడిపిస్తున్నారు. దీంతో ఆప్ఘన్ ప్రభుత్వం తిరిగి తాలిబన్ల చేతుల్లో నుంచి ఛారికర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది.

 ఆప్ఘనిస్తాన్ సంక్షోభం

ఆప్ఘనిస్తాన్ సంక్షోభం

ఆప్ఘనిస్తాన్ లో అష్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం దేశాన్ని కాపాడుకోవడంలో విఫలం కావడంతో సాయుధులైన తాలిబన్లు దేశంలో ఒక్కో ప్రాంతాన్నీ, రాష్ట్రాన్నీ ఆక్రమిస్తూ పోయారు. చివరికి రాజధాని అయిన కాబూల్ బయట మోహరించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లారు. దీంతో చేసేది లేక అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అధికారాన్ని వారికి అప్పగించి రహస్యంగా తజికిస్ధాన్ పారిపోయారు. దీంతో ఆప్ఘనిస్తాన్ లో రెండు దశాబ్దాల పాలన ముగిసిందని అంతా భావించరాు. తాలిబన్ల శకం ప్రారంభమైనట్లేనని భావిస్తూ ప్రజలు సైతం కాబూల్ వదిలి పారిపోవడం మొదలుపెట్టారు.

 ఆప్ఘనిస్తాన్ లో భారీ ట్విస్ట్

ఆప్ఘనిస్తాన్ లో భారీ ట్విస్ట్

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం కుప్పకూలి తాలిబన్ల రాజ్యం మొదలైందని అంతా భావిస్తున్న తరుణంలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని వదిలి పారిపోవడంతో ఇక తాలిబన్లదే ఆధిపత్యం అని అంతా భావిస్తున్న నేపథ్యంలో ఈ ట్విస్ట్ చోటు చేసుకుంది. దీంతో మరో రెండు మూడు రోజుల్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాలిబన్లకు భారీ షాక్ తగిలింది. అధ్యక్షుడు అష్రప్ ఘనీ పారిపోయినా ఆయన తర్వాత ప్రభుత్మంలో రెండో స్ధానంలో ఉన్న ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తెరపైకి వచ్చారు. భారత్ మద్దతున్న అమ్రుల్లా సలేహ్ తాలిబన్లకు తలొగ్గేందుకు నిరాకరించారు.

 అమ్రుల్లా సలేహ్ అద్భుతం

అమ్రుల్లా సలేహ్ అద్భుతం

ఆప్ఘనిస్తాన్ లో ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ చివర్లో కాబూల్ చేరిన తాలిబన్లు ఇక అంతా అయిపోయినట్లేనని భావించారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే మిగిలుందని భావిస్తున్నారు. రేపోమాపో ప్రభుత్వం కూడా కొలువు దీరుతుందని, ఇందులో మహిళలకు సైతం స్ధానం కల్పిస్తామని నమ్మబలుకుతున్నారు. ప్రజలందరినీ క్షమించేశామని ప్రగల్భాలు కూడా పలుకుతున్నారు. ఈ సమయంలో తెరపైకి వచ్చిన ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్.. తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన నేపథ్యంలో తాను తదుపరి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాదు వచ్చీ రాగానే తాలిబన్లపై తిరుగుబాటు కూడా మొదలుపెట్టేశారు.

 తాలిబన్లకు తొలిషాక్-ఛారికర్ తిరిగి స్వాధీనం

తాలిబన్లకు తొలిషాక్-ఛారికర్ తిరిగి స్వాధీనం

ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్న ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్.. ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోపే ఆర్మీతో కలిసి పోరాటాన్ని ముందుకు నడిపేందుకు సిద్ధమయ్యారు. ముందుగా తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ఛారికర్ పట్టణంపై దృష్టిపెట్టారు. కాబూల్ కు ఉత్తరాన పర్వాన్ ప్రావిన్స్ లో ఉన్న ఛారికర్ పట్టణంపై ఆర్మీ విరుచుకుపడింది. దీంతో అక్కడ తాలిబన్లు చేతులెత్తేశారు. దీంతో ఛారికర్ పట్ఠణం తిరిగి ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వ వశమైంది. మరో ప్రాంతం పంజ్ షీర్ గోర్జ్ వద్ద తాలిబన్లతో ఆర్మీ దళాల పోరాటం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాబూల్ ను మజారే షరీఫ్ తో కలిపే టన్నెల్ ఛారికర్ పట్టణంలోనే ఉండటంతో అమ్రుల్లా సలేహ్ ఆధ్వర్యంలో ఆర్మీ దీన్ని స్వాధీనం చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తాలిబన్లు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+