Ivy Gourd: కిలో దొండకాయ రూ.900.. ఆశ్చర్యపోతున్నారా..!
సాధారణంగా కిలో దొండకాయల(Ivy gourd)కు ఎంత ధర ఉంటుంది. ఏముంది రూ.40 ఉంటుంది. మహా అయితే రూ.100 ఉండొచ్చు. కానీ ఓ ప్రాంతంలో కేజీ దొండకాయల ధర ఏకంగా రూ. 900 పలుకుతోంది. అయితే ఇది మన దేశంలో కాదు. ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో.. అవును లండన్ కిలో దొండకాయ వెయ్యి రూపాయలకు చేరువయింది. లండన్ స్థిరపడిన ఓ భారతీయుడు కేజీ దొండకాయ రూ.900 అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ప్రస్తుతం అది వైరల్ గా మారింది. భారత్ నుంచి ఓ యువకుడు పై చదువుల కోసం లండన్ వెళ్లాడు. అక్కడే ఉద్యోగం రావడంతో అక్కడే స్థిరపడ్డాడు.
అతను అక్కడ కూరగాయలు కొనడానికి వెళ్లాడు. సూపర్ మార్కెట్ దొండకాయల కొనుగోలు చేద్దామని ధర చూసి ఆశ్చర్యపోయాడు. దొండకాయ ధర చూసి షాకయ్యాడు. వెంటనే ప్రైస్ ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోను ఓంకార్ ఖండేకర్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఫొటోలో కాకరకాయ, బెండకాయ, టమాటా, పచ్చి మిర్చి, వంకాయ ఉన్నాయి. ఓ ట్రేలో దొండకాయలు ఉన్నాయి. అక్కడ ఓ అట్టపై కిలో దొండకాయ ధర 8.99 పౌండ్లు అని రాసి ఉంది. అంటే మన ఇండియాన్ కరెన్సీలో ఇది రూ.900 పైనే. ఫొటోతో పాటు లండన్ బాగానే ఉంది. కానీ దొండకాయ ధరలే కిలోకు రూ.900 ఉన్నాయని రాసుకొచ్చాడు.

ఈ పోస్ట్ చూసిన అందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం డిఫరెంట్ గా స్పందించాడు. రోమ్ లో ఉంటే రోమ్ లో ఉన్నట్లు ఉండాలని కామెంట్ చేశాడు. దొండకాయలు తినకూడదంటూ కామెంట్ చేశాడు. గతేడాది అక్టోబరు లో యూకే టమాటా ధరలు భారీగా పెరిగాయి. టమాటా ధరలు భారీగా పెరగడంతో కొన్ని రెస్టారెంట్లు మూతకూడ పడ్డాయి. పిజ్జా అందించే రెస్టారెంట్లు ధర పెరుగుదలతో ఇబ్బందుల్లో పడ్డాయి.టమాటా ధర క్కో కేసుకు 5 యూరోల నుంచి 20 యూరోలకు పెరిగాయి. అంటే దాదపు 400% పెరిగాయి. విదేశాల నుంచి సరఫరా తగ్గడం టమాటా రేట్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు.
దాదాపు రెండు నెలల తర్వాత లండన్ లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే కూరగాయలు తినాలంటే వేలు ఖర్చు పెట్టాల్సిందేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications