ఇండియాకి కూడా భారీ భూకంపం ఎఫెక్ట్. ఇంకా ఎక్కడెక్కడ అంటే..?
భారీ భూకంపం మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలను కుదిపేసింది. మయన్మార్‌లో శుక్రవారం మధ్యాహ్నాం 12గం.50ని. ప్రాంతంలో తొలుత భూమి భారీగా కంపించింది. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే మరోసారి కంపించింది. మొదటిసారి రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో.. రెండోసారి 6.4 తీవ్రత నమోదైంది. భూ ప్రకంపనల ధాటికి భారీ బిల్డింగులు సైతం ఊగిపోయి కుప్పకూలాయి. ప్రాణ, ఆస్తి నష్టాలు భారీగా సంభవించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోసారి భూకంపం వస్తాయన్న హెచ్చరికలు అక్కడి అధికారులు భవనాల నుంచి జనాల్ని ఖాళీ చేయిస్తున్నారు.
మరోవైపు ఈ భూకంపం ధాటికి థాయ్‌లాండ్ ఉత్తర భాగం మొత్తం భూకంపంతో వణికిపోయింది. రాజధాని బ్యాంకాక్‌లో 7.3 తీవ్రతతో భూమి కంపించడంతో భవనాలు ఊగిపోయాయి. భూకంపం ధాటికి జనం ప్రాణ భయంతో హాహాకారాలు చేస్తూ రోడ్ల మీదకు పరుగులు పెడుతున్నారు. బిల్డింగులు కూలిపోయిన వీడియోలు, జనాలు పరుగులు పెడుతున్న దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలతో పాటు చైనా, భారత్, లావోస్, బంగ్లాదేశ్‌లోనూ ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. భారత్‌లో మణిపూర్, కోల్‌కతా, మేఘాలయా, అస్సాం, నాగాలాండ్‌లలోనూ ఈ ప్రభావం కనిపించిందని చెబుతున్నారు. దీంతో నివాసితులు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
High-rise building collapses due to strong #earthquake in Chatuchak, Bangkok. #แผ่นดินไหว #กรุงเทพมหานคร pic.twitter.com/fiRV6ZIZq2
— Weather Monitor (@WeatherMonitors) March 28, 2025
మయన్మార్‌లోని సగైంగ్‌కు 16 కిలోమీటర్ల దూరంలో.. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనం కుప్పకూలిపోవడం, ప్రకంపనల ధాటికి పైఅంతస్తుల్లోని స్విమ్మింగ్ పూల్స్ నుంచి నీరు కిందకు పడడం, మండాలెలో ఇర్రవడ్డీ నదిపై ఉన్న చారిత్రక వంతెన అవా బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. మయన్మార్, థాయ్‌లాండ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
[Update] A 7.7 magnitude earthquake struck Myanmar at 13:20, with a depth of 10 km and coordinates 96.12°E, 22.07°N. The tremor was felt in the northern and central regions, including Bangkok. Tall buildings in Bangkok and nearby areas swayed because of low-frequency waves.… pic.twitter.com/ar5dpWd5gb
— Thai Enquirer (@ThaiEnquirer) March 28, 2025
Devastation across the city of Mandalay in Myanmar, as a result of today’s 7.7 magnitude earthquake, with dozens of buildings having collapsed as well as the Ava Bridge over the Irrawaddy River. pic.twitter.com/8YE8KsxXws
— OSINTdefender (@sentdefender) March 28, 2025
[Update] A 7.7 magnitude earthquake struck Myanmar at 13:20, with a depth of 10 km and coordinates 96.12°E, 22.07°N. The tremor was felt in the northern and central regions, including Bangkok. Tall buildings in Bangkok and nearby areas swayed because of low-frequency waves.… pic.twitter.com/ar5dpWd5gb
— Thai Enquirer (@ThaiEnquirer) March 28, 2025












Click it and Unblock the Notifications