షికాగోలో పాకిస్తాన్,చైనా దౌత్యకార్యాలయాల బయట శాంతియుత ర్యాలీ నిర్వహించిన ఇండో అమెరికన్లు
ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదులకు చైనా మద్దతును ఉపసంహరించుకోవాలంటూ షికాగోలోని చైనా దౌత్యకార్యాలయం ఎదుట ఇండో అమెరికన్లు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులను చైనా వెనకేసుకురావడం తగదని వారు అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా సమాఖ్యలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనా జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజర్‌ను వెనకేసుకురావడం.. ఇప్పటికే భారత్ పదేపదే తప్పుబట్టడం జరుగుతోంది. ఈ మధ్యే ఆ ఉగ్రవాద సంస్థ పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసింది.
"ఉగ్రవాదాన్ని అణిచివేయాలని పాక్ పై చైనా ఒత్తిడి తీసుకురావాలి" అని అన్నారు ఇండియన్ అమెరికన్ కల్చరల్ సెంటర్ ఛైర్మెన్ భరత్ బరాయ్ . ఈ మేరకు షికాగో లోని చైనా కాన్సులేట్‌లోని కన్సుల్ జనరల్‌కు మెమొరాండం ఇచ్చారు. షికాగోలో ఇండో అమెరికన్లు ఇలా చైనా కాన్సులేట్ ముందుకు వచ్చి నిరసన వ్యక్తం చేయడం తొలిసారి. నిరసనలో భాగంగా ఉగ్రవాదానికి మద్దతు తెలపడం మానివేయండి అంటే ఫ్లకార్డులు ప్రదర్శించారు. భారత్ మాతా కీ జై అని నినాదంతో ప్రాంతమంతా మార్మోగిపోయింది. అంతేకాదు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందంటూ వెంటనే ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఉగ్రవాదులకు సపోర్ట్ చేయడం పాకిస్తాన్ ఇప్పటికైనా మానుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు షికాగోలోని పాకిస్తాన్ కాన్సులేట్‌లో మెమొరాండం సమర్పించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని మండిపడ్డ కమ్యూనిటీ సభ్యులు ఉగ్రవాదుల ఫ్యాక్టరీగా పాక్ తయారైందని మండిపడ్డారు. అంతేకాదు న్యూయార్క్, న్యూ జెర్సీ, కనెక్టికట్‌లలో నివసించే భారతీయులు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇండియన్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
-
రెడ్ జోన్.. పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications