రెస్టారెంట్‌లో మనిషి మాంసం వండుతున్నారని!: యూకెలో కలకలం!..

Subscribe to Oneindia Telugu

లండన్: బ్రిటన్ లో ఓ తప్పుడు ప్రచారం కలకలం రేపింది. యూకెలోని కర్రీ ట్విస్ట్ అనే భారతీయ రెస్టారెంట్ లో మనిషి మాంసం వండుతున్నారన్న వదంతులు తీవ్రంగా వ్యాపించాయి. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం తీవ్రం కావడంతో.. హెటల్ బిజినెస్ తీవ్రంగా దెబ్బతిని, ఏకంగా మూతపడేదాకా వెళ్లింది.

నాన్ వెజ్ వంటకాల పేరుతో ఇండియన్ రెస్టారెంట్ లో మనిషి మాంసం వండుతున్నారని పేర్కొంటూ.. ఓ నెటిజెన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారి.. జనమంతా నిజమేనని నమ్మేశారు. దీనిపై హోటల్ యాజమాన్యం స్పందిస్తూ.. తమ బిజినెస్ ను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కావాలనే ఇలాంటి ప్రచారానికి తెరదీశారని ఆరోపించారు.

indian eatery in uk could close after human meat report

ఈ ఫేక్ వార్తను నిజమేననుకుని నమ్మి.. కొంతమంది హోటల్ పై దాడికి కూడా యత్నించారని అన్నారు. గత 60ఏళ్లుగా తాము రెస్టారెంట్ నడుపుతున్నామని, ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ఊహించలేదని చెప్పారు. ఓ ఫేక్ న్యూస్ వెబ్ సైట్ ప్రచురించిన వార్తను నిజమనుకోవడమేంటని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ బిజినెస్ ను దెబ్బతీయాలని ప్రచురించిన.. ఆ ఫేక్ వార్తలో అన్నీ స్పెల్లింగ్ మిస్టెక్సే ఉన్నాయన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An Indian restaurant in the UK could be forced to shut down after a fake news report claimed it serves human meat. The fake report went viral on Facebook.
Please Wait while comments are loading...