
అమెరికాలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్య: కొరియన్ రూమ్మెట్ అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొరియన్ జాతీయుడు జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన యూనివర్సిటీ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పర్డ్యూ యూనివర్శిటీలో చదువుతున్న వరుణ్ మనీష్ ఛేడా అనే 20 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన విద్యార్థి అమెరికాలోని ఇండియానాలోని తన డార్మిటరీలో హత్యకు గురయ్యాడు.
మనీష్ గదిలోనే ఉండే ఓ కొరియన్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇండియానాపోలిస్‌కు చెందిన వరుణ్ మనీష్ ఛేడా.. క్యాంపస్ పశ్చిమంలోని మెక్‌కట్చియాన్ హాల్‌లో శవమై కనిపించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
కొరియాకు చెందిన జూనియర్ సైబర్ సెక్యూరిటీ మేజర్, అంతర్జాతీయ విద్యార్థి అయిన జి మిన్ "జిమ్మీ" షా బుధవారం ఉదయం 12:45 గంటలకు 911కి కాల్ చేసి మరణం గురించి పోలీసులను అప్రమత్తం చేసినట్లు పర్డ్యూ యూనివర్సిటీ పోలీస్ చీఫ్ లెస్లీ వైట్ తెలిపారు.

అయితే, కాల్ వివరాలు వెల్లడించలేదు. మెక్‌కట్చియాన్ హాల్ మొదటి అంతస్తులోని ఓ గదిలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే బుధవారం పలువురు బాధితుడి అరుపులు విన్నారు
ఛేదా యూనివర్సిటీలో డేటా సైన్స్ చదువుతున్నాడు. ఛేడా శరీరంపై తీవ్రమైన గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. ఏ కారణం లేకుండానే నిందితుడు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
What a beautiful, enormous turnout here at Purdue University for a candlelight vigil in honor of Varun Manish Chheda, who lost his life this morning in an on-campus stabbing in his dorm room. @FOX59 @CBS4Indy pic.twitter.com/clTsldIrcZ
— Courtney Spinelli (@CourtSpinelliTV) October 6, 2022
ఛేడా చిన్ననాటి స్నేహితుడు అరుణాభ్ సిన్హా మాట్లాడుతూ.. ఛేడా గది నుంచి మంగళవారం రాత్రి అరుపులు వినిపించాయని చెప్పారు. స్నేహితులతో కాసేపు గేమ్ ఆడి ఆ తర్వాత అతని నుంచి స్పందన రాలేదని తెలిపారు. చేడా మరణం తమను కలిచివేసిందని ఆయన స్నేహితులు భావోద్వేగానికి గురయ్యారు.
కాగా, వరుణ్ మృతికి పలువురు యూనివర్సిటీ విద్యార్థులు తరలివచ్చి సంతాపం తెలిపారు. అనేక మంది విద్యార్థులు పుష్పగుఛ్చాలు ఉంచి నివాళులర్పించారు.