ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్లి భారతీయ సంతతి విద్యార్ధిని మిస్సింగ్.. ఎక్కడంటే ?
అమెరికాలో ఉంటున్న భారతీయ సంతతికి చెందిన విద్యార్దిని స్నేహితులతో కలిసి.. ట్రిప్ కి వెళ్లి మిస్ అవ్వడం తీవ్ర కలకలంగా మారింది. గత వారంలో ఈ ఘటన చోటు చేసుకోగా ఆ యువతి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని వర్జీనియాలో సుదీక్ష కోణంకి నివాసం ఉంటోంది. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో ఆమె చదువుకుంటున్నారు. అయితే గత వారం ఆమె తన ఐదుగురు అమ్మాయిలతో కలిసి డొమినికన్ రిపబ్లిక్‌లోని ప్యూంటా కానా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మార్చి ఆరో తేదీన స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్ వద్ద బీచ్ వెంట నడుచుకుంటూ కనిపించారు. ఆ తర్వాత ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆందోళనకు గురై పోలీసులను సంప్రదించారు.

అయితే వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సముద్ర తీరం వద్ద, సముద్రం లోపల డ్రోన్లు, హెలికాప్టర్లతో గత నాలుగు రోజులుగా ఆమె కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు ఏ ఆచూకీ లభించకపోవడంతో.. ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
భారత సంతతికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి, అక్కడ శాశ్వత నివాసం పొందారు. రోజులు గడుస్తున్నా సుదీక్ష ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె సముద్రంలో కొట్టుకుపోయిందనే తేల్చేయకూడదని.. ఎవరో ఆమెను కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని వారు భావిస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియా వేదికగా భారతీయులను, ప్రవాస భారతీయులను తమకు సహాయంగా నిలవాలని సుదీక్ష కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Urgent missing college student on Spring Break in the Dominican Republic - Sudiksha Konanki - last seen in brown bikini in picture below 👇 pic.twitter.com/AMdYPngwVK
— Glenda (@Glendaragnarson) March 10, 2025
ఈ ఘటనపై ఇండియన్ ఎంబస్సీ సైతం ప్రత్యేక దృష్టి సారించింది. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కూడా దీనిపై స్పందించారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తున్నామని.. సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అమెరికా అధికారులు కూడా డొమినికన్ రిపబ్లిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications