Indian Teacher: విద్యా విప్లవంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారత మహిళ
మురికివాడలోని పాడైపోయిన గోడ ఒక రోజు పిల్లల భవిష్యత్తును మార్చగలదని ఎవరైనా ఊహించారా? చాక్ పీస్, బ్లాక్‌బోర్డ్, క్లాస్‌రూమ్ లేకుండానే అక్షరాలు, సంఖ్యలు, శాస్త్రం నేర్పవచ్చని ప్రపంచానికి నిరూపించిన భారతీయ ఉపాధ్యాయురాలు (Indian Teacher) రూబల్ నాగి (Rouble Nagi). ఆమె ఆలోచనలకే కాదు, ఆచరణకు దక్కిన గౌరవం ప్రపంచానికి భారతదేశ సత్తాను మరోసారి నిరూపించింది.
ఫిబ్రవరి 5, 2026న దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్‌లో, ప్రపంచ నేతలు, విధానకర్తల సమక్షంలో రూబల్ నాగి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. వార్కీ ఫౌండేషన్, UNESCO సంయుక్త ఆధ్వర్యంలో GEMS ఎడ్యుకేషన్ నిర్వహించే ఈ అవార్డు, ప్రపంచంలోనే అత్యున్నత ఉపాధ్యాయ గౌరవంగా గుర్తింపు పొందింది. 2015లో ప్రారంభమైన ఈ పురస్కారాన్ని అందుకున్న పదవ ఉపాధ్యాయురాలుగా రూబల్ చరిత్ర సృష్టించారు.

మురికివాడల నుంచి మలుపు తీసుకున్న విద్య
గత రెండు దశాబ్దాల్లో, రూబల్ నాగి తన రూబల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ (RNAF) ద్వారా భారతదేశవ్యాప్తంగా 100కు పైగా వెనుకబడిన ప్రాంతాల్లో 800కు పైగా అభ్యాస కేంద్రాలు స్థాపించారు. పాఠశాలకు వెళ్లని పిల్లలకు ప్రాథమిక విద్య, డ్రాపౌట్స్‌కు తిరిగి చదువు, స్కూల్ పిల్లలకు పరిహార విద్య - అన్నీ ఒకే మోడల్‌లో అందించారు.
'లివింగ్ వాల్స్ ఆఫ్ లెర్నింగ్' - గోడలపై జ్ఞానం
రూబల్ పనిలో అత్యంత విప్లవాత్మక ఆలోచన "లివింగ్ వాల్స్ ఆఫ్ లెర్నింగ్". పాడుబడ్డ గోడలపై వేసిన రంగుల కుడ్య చిత్రాలు ఇప్పుడు అక్షరాస్యత, గణితం, సైన్స్, పరిశుభ్రత, చరిత్ర, పర్యావరణ అవగాహన నేర్పే గురువులయ్యాయి. ఈ గోడలు పిల్లలతో పాటు తల్లిదండ్రులు, స్థానిక సమాజాన్నీ అభ్యాసంలో భాగస్వామ్యం చేస్తున్నాయి.
వాస్తవ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారం
పేదరికం, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, అనియమిత హాజరు, మౌలిక వసతుల కొరత - ఇవన్నీ కేవలం గణాంకాలు కావని, నేలమీద ఉన్న వాస్తవాలని రూబల్ గుర్తించారు. అందుకే అనువైన సమయాలు, పునర్వినియోగ వస్తువులతో ప్రత్యక్ష అభ్యాసం, జీవితానికి పనికొచ్చే నైపుణ్యాలతో విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఫలితాలు మాటలకన్నా గొప్పవి
ఈ మోడల్ వల్ల అనేక ప్రాంతాల్లో డ్రాపౌట్ రేట్లు 50 శాతానికి పైగా తగ్గాయి. దీర్ఘకాలిక పాఠశాల నిలుపుదల మెరుగుపడింది. 600 మందికి పైగా వాలంటీర్లు, జీతంతో పనిచేసే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి, దేశవ్యాప్తంగా విస్తరించదగిన విద్యా మోడల్‌ను నిర్మించారు.
$1 మిలియన్ బహుమతి... లక్షల జీవితాల కోసం
ఈ భారీ బహుమతి మొత్తాన్ని రూబల్ నాగి వ్యక్తిగతంగా వినియోగించబోమని స్పష్టం చేశారు. ఉచిత వృత్తిపరమైన శిక్షణ, డిజిటల్ అక్షరాస్యత అందించే సంస్థను నిర్మించి, లక్షలాది అణగారిన పిల్లలు, యువత జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఆమె లక్ష్యం.
ఉపాధ్యాయురాలే కాదు... అంతర్జాతీయ కళాకారిణి
విద్యతో పాటు కళను సమాజ మార్పుకు సాధనంగా మలిచిన వ్యక్తిత్వం రూబల్. ఆమె ఇప్పటివరకు 850కి పైగా కుడ్య చిత్రాలు, శిల్పాలు, 200కు పైగా అంతర్జాతీయ ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రపతి భవన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఆహ్వానించబడిన తొలి కళాకారిణిగా గుర్తింపు పొందారు. ఆమె రచనలు భారత రాష్ట్రపతి శాశ్వత సేకరణలో నిలిచాయి.
గౌరవాల జాబితాలో మరో మైలురాయి
జిజిమాత అవార్డు, GR8 అవార్డు, MAP నోబెల్ ఆర్టిస్ట్ అవార్డు, హల్లో ఊర్జ అవార్డు వంటి అనేక గౌరవాల తర్వాత, గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026 ఆమె సేవలకు ప్రపంచ స్థాయి ముద్ర వేసింది.
Indian teacher Rouble Nagi has won the Global Teacher Prize 2026, receiving the one million dollar award at the World Government Summit in Dubai.
— All India Radio News (@airnewsalerts) February 6, 2026
The award, presented by GEMS Education in its tenth edition, was handed over by Dubai Crown Prince Sheikh Hamdan bin Mohammed bin… pic.twitter.com/VxvOaL6wGI
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications