భారతీయుల విసాపై కీలక నిర్ణయం

Iran visa: ఇరాన్.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భారతీయులకు విసా నిబంధనలను రద్దు చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచే ఇది అమలులోకి వచ్చినట్లు వెల్లడించింది. వివిధ కారణాల రీత్యా తమ దేశాన్ని సందర్శించడానికి వచ్చే భారతీయులకు జారీ చేసే విసా నిబంధనలను మరింత సరళీకరించింది.

దీనికి అవసరమైన కొన్ని నిబంధనలను ప్రకటించింది ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. అందులో పొందుపర్చిన అంశాలన్నింటినీ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు, కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.

Iran announces visa for Indian citizens will be abolished and issued subject to the conditions

1. ఆర్డినరీ పాస్‌పోర్ట్ ఉన్న వారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఇరాన్‌లో అడుగుపెట్టవచ్చు. అది కూడా 15 రోజుల వరకు మాత్రమే అక్కడ నివసించవచ్చు. ఈ 15 రోజుల్లోగా వాళ్లు తమ దేశం నుంచి వెనక్కి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 15 రోజుల గడువును పొడిగించరు.

2. ఇరాన్‌లోని పర్యాటక కేంద్రాలను సందర్శించడానికి వచ్చే వారికి విసా రద్దు వర్తిస్తుంది.

3. 15 రోజుల కంటే ఎక్కువ కాలం ఇరాన్‌లో నివసించాలనుకునే వారు లేదా ఆరు నెలల్లో ఎక్కువసార్లు ఆ దేశానికి వెళ్లాలనుకునే వారు ప్రత్యేక విధానం కింద విసా కోసం దరఖాస్తులను దాఖలు చేయాల్సి ఉంటుంది. అత్యవసర విసాను పొందాల్సి ఉంటుంది. దీనికోసం భారత్‌లోని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

4. వాయు మార్గం గుండా ఇరాన్‌లో అడుగుపెట్టదలిచిన వారికి మాత్రమే ఈ విసా నిబంధనలు వర్తిస్తాయి. రోడ్డు మార్గంలో వెళ్లే వారికి వర్తించవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+