వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ కు మిత్రదేశం ఇరాన్ ఊరట.. చైనా, అమెరికాకు షాకిస్తూ - అవన్నీ పుకార్లేనంటూ..

|
Google Oneindia TeluguNews


అంతర్జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న పెను మార్పులు అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా కేంద్రంగా సాగుతున్న వేళ వీటికి భయపడి భారత్ ను ఓ కీలక ప్రాజెక్టు నుంచి ఇరాన్ తప్పించినట్లు తాజాగా వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఒట్టిదేనని ప్రకటించిన ఇరాన్... భారత్ తో తమకున్న సంబంధాలు, ఒప్పందం వివరాలను మరోసారి ప్రస్తావించింది. తద్వారా అమెరికా, చైనాలకు భయపడి భారత్ వంటి మిత్రదేశాన్ని దూరం చేసుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పినట్లయింది.

చైనా కట్టడిలో భారత్ వెంటే యూరప్.. మోదీతో ఈయూ నేతలు.. వాణిజ్య ఒప్పందాలపై ఇలా..చైనా కట్టడిలో భారత్ వెంటే యూరప్.. మోదీతో ఈయూ నేతలు.. వాణిజ్య ఒప్పందాలపై ఇలా..

 చబహార్ రైల్వే ప్రాజెక్ట్...

చబహార్ రైల్వే ప్రాజెక్ట్...

భారత్, ఇరాన్ మధ్య ఉన్న సుదీర్ఘ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ఇరుదేశాల మధ్య ఆర్ధిక కారిడార్ కోసం చబహార్ రైల్వే ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఇరాన్ లోని చబహార్ పోర్టు నుంచి భారత్ లోని జాహెదాన్ వరకూ 628 కిలోమీటర్ల పొడవున రైల్వే మార్గం నిర్మించడం ద్వారా ఇరుదేశాలకూ ఆర్ధికంగా ప్రయోజనం ఉండేలా దీనికి రూపకల్పన చేశారు. భారతీయ రైల్వే ఇందుకోసం 1.6 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టేందుకు ముందుకొచ్చింది. పశ్చిమాసియా ప్రాంతంలో భారత్ ప్రయోజనాలకు ఇదెంతో కీలకం. అయితే ఈ ప్రాజెక్టు వివిధ కారణాలతో నత్తనడకన సాగుతోంది. భారత్ పెట్టాలని భావించిన ఖర్చు కూడా ఇంకా పెట్టలేదు. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి భారత్ నుంచి తప్పిస్తూ ఇరాన్ నిర్ణయం తీసుకుందని, స్వంతంగా ఈ ప్రాజెక్టును నిర్మించాలనుకుంటోందని వార్తలొచ్చాయి.

 పుకార్లు ఒట్టివే అన్న ఇరాన్..

పుకార్లు ఒట్టివే అన్న ఇరాన్..

అెమెరికా ఆంక్షలకు భయపడి భారత్ తమ దేశంలో చేపట్టిన చబహార్ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని భావించిన ఇరాన్.. ఈ ప్రాజెక్టు నుంచి భారత్ ను తప్పించి స్వంతగా నిర్మించుకోవాలని భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అవన్నీ ఒట్టి పుకార్లేనని ఇరాన్ తాజాగా స్పష్టత నిచ్చింది. భారత్ తో చబహార్ డీల్ లో రెండు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ఇరాన్ పేర్కొంది. ఇందులో చబహార్ పోర్టుకు సంబంధించిన యంత్ర పరికరాల ప్రాజెక్టు ఒకటి కాగా.. రైల్వే రైన్ మరొకటి. ఈ రెండు ప్రాజెక్టుకు కొనసాగుతున్నట్లు ఇరాన్ తాజాగా తెలిపింది. చైనాతో 400 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందానికి సిద్దమవుతున్న ఇరాన్ అందుకోసమే భారత్ ను కాదనుకుందని కూడా రూమర్లు వచ్చాయి. ఇవన్నీ ఒట్టివేనని ఇరాన్ తేల్చిచెప్పింది.

 అమెరికా, చైనాకు షాక్...

అమెరికా, చైనాకు షాక్...

వాస్తవానికి మారిన పరిస్ధితుల్లో ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమంపై గుర్రుగా ఉన్న అమెరికా... ఆ దేశంతో అన్ని బంధాలు తెంచుకోవాలని భారత్ సహా పలు దేశాలపై ఒత్తిళ్లు తెస్తోంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను ప్రోత్సహించరాదని తీవ్ర ఒత్తిడి తెచ్చింది.

చైనా కూడా వ్యూహాత్మక దేశంగా ఇరాన్ ను గుర్తిస్తూ సాయం చేసేందుకు సిద్దమవుతోంది. దీంతో ఇరాన్-భారత్ బంధానికి కాలం చెల్లినట్లేనన్న రూమర్లు వచ్చాయి. కానీ అమెరికా ఒత్తిడికి తలొగ్గి చిరకాల మిత్రదేశమైన ఇరాన్ ను వదులుకునేందుకు భారత్ సిద్దపడలేదు. దీంతో ఇరాన్ కూడా ఇప్పుడు తమ ఒప్పందాలను కొనసాగించి తీరాలనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. అమెరికా, చైనా కంటే భారత్ తో బంధమే ముఖ్యమని మరోసారి తేల్చిచెప్పినట్లయింది.

English summary
Iran denied an Indian newspaper report that New Delhi was dropped from a key rail project along the border with Afghanistan after it showed reluctance in investing fearing American sanctions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X