ఇరాన్ సుప్రీం లీడర్ కుడిభుజాన్ని మట్టుబెట్టిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు రోజురోజుకూ ఉధృతమౌతోంది. వరుసగా అయిదో రోజూ దాడులు- ప్రతిదాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
రెండున్నర సంవత్సరాలుగా ప్రతీకారదాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్.. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ మరో బ్రేక్ త్రూ సాధించింది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అలీ షద్మనీని మట్టుబెట్టింది. టెహ్రాన్ పై సాగించిన వైమానిక దాడుల సందర్భంగా షద్మనీ మరణించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టింది.
సరిగ్గా నాలుగు రోజుల కిందటే ఆయన ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా అపాయింట్ అయ్యారు. సుప్రీమ్ లీడర్ ఇమామ్ సయ్యద్ అలీ ఖమేనీకి అత్యంత ఆప్తుడిగా గుర్తింపు ఉంది. కుడిభుజంగా చెబుతుంటారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఆర్మీ చీఫ్ లెప్టినెంట్ జనరల్ ఘొలామ్ అలీ రషీద్ మరణించడంతో ఆయన స్థానంలో అలీ షద్మనీ నియమితులయ్యారు.
ఇప్పుడు ఆయనను కూడా మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. అయిదు రోజుల వ్యవధిలో ఇరాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ను హతమార్చడం ఇది రెండోసారి అని ప్రకటించింది. ఖచ్చితమైన నిఘా సమాచారం తర్వాత, ఇరాన్ సీనియర్-మోస్ట్ మిలిటరీ అధికారి ఖమేనీకి అత్యంత సన్నిహిత సైనిక సలహాదారు అలీ షద్మనీ.. సెంట్రల్ టెహ్రాన్‌లో జరిగిన దాడిలో మరణించారినట్లు తెలిపింది.
In view of Lt. Gen. Gholamali Rashid’s martyrdom at the hands of the vile Zionist regime, and in light of Major General Ali Shadmani's meritorious services & valuable experience, I confer the rank of Major Gen. & appoint him Commander of the Khatam al-Anbiya (pbuh) Central HQ. pic.twitter.com/4dTDCKx66P
— Khamenei.ir (@khamenei_ir) June 13, 2025
ఇజ్రాయెల్ సాగిస్తోన్న దాడులతో ఇరాన్ పూర్తిగా ఆత్మరక్షణలో పడినట్టయింది. అటు అమెరికా సైతం ఇజ్రాయెల్ వైపే మొగ్గు చూపడం, ఇరాన్ కు హెచ్చరికలను జారీ చేయడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కండిషన్లకు ఇరాన్ అంగీకరించకపోతే ఇజ్రాయెల్ కు సైనిక సహకారాన్ని కూడా అందించడానికి అమెరికా వెనుకాడకపోవచ్చు.
For the second time in 5 days— the IDF has eliminated Iran’s War-Time Chief of Staff, the regime’s top military commander.
— Israel Defense Forces (@IDF) June 17, 2025
Ali Shadmani, Iran’s senior-most military official and Khamenei’s closest military advisor, was killed in an IAF strike in central Tehran, following precise… pic.twitter.com/Bq6Z49zeCj
ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ లో మరణించిన వారి సంఖ్య 224కు చేరుకుంది. వారిలో ఎక్కువమంది సాధారణ ప్రజలేనని ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్ లో ఇప్పటివరకు 24 మంది మరణించారు. ఇరాన్ క్షిపణి దాడుల వల్ల దాదాపు 3,000 మందికి స్థానికులు తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.












Click it and Unblock the Notifications