భూమి లాంటి మరో గ్రహం: మీడియాకు రేపు నాసా
అంతరిక్షంలో భూమి లాంటి మరో గ్రహాన్ని నాసా కనుగొన్నదా? అంటే అవుననే సమాధానం వస్తుంది. నివసించేందుకు భూమి కాకుండా మరో గ్రహం ఎక్కడుందోనన్న విషయమై ఎన్నో ఎళ్లుగా జరుపుతున్న ప్రయోగాలు ఫలించాయని, మరో భూమిని నాసా కనుగొన్నదని తెలుస్తోంది.
ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించేందుకు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించాలని నాసా అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. నాసా అధికారిక వెబ్ సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం ఉదయం 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7 గంటలకు) మీడియా సమావేశం జరగనుంది.

నాసా కెప్లర్ మిషన్‌లో భాగంగా తాము కనుగొన్న కొత్త విషయాలను నాసా సైన్సు మిషన్ డైరెక్టరేట్ జాన్ జెన్‌కిన్స్ తెలియజేయనుంది. కెప్లర్ టెలిస్కోప్ ఇప్పటి వరకు 1000కి పైగా గ్రహాలను కనుగొంది.












Click it and Unblock the Notifications