ఎంహెచ్ 370, బీచ్‌లో టవల్ లాంటి ప్యాకెట్: క్లూ దొరికిందా?
కౌలాలంపూర్: గత ఏడాది (2014) మార్చి 8న గల్లంతైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370కి చెందిన ఓ క్లూ దొరికినట్లుగా తెలుస్తోంది. మంగళవారం నాడు ఆస్ట్రేలియా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఒక చిన్న కర్చీఫ్ లేదా టవల్ లాంటి ప్యాకెట్ కనిపించింది.

దీంతో కొద్దిగా ఆశలు రేకెత్తాయి. ఎంహెచ్ 370 ఎక్కడ కూలుతుందో దీనిని బట్టి తెలియవచ్చునని భావిస్తున్నారు. కింగ్ స్లే, విక్కీ మిల్లర్ అనే దంపతులు సెర్ వాంటెస్ బీచ్ తీరంలో వెళ్తుండగా ఈ ప్యాకెట్ దొరికింది. దీని మీద మలేషియా ఎయిర్ లైన్స్ లోగో కనిపిస్తోంది. దీంతో వారు దానిని పోలీసులకు ఇచ్చారు.
ఆ కర్చీఫ్ లాంటి వస్తువు మలేషియా ఎయిర్ లైన్స్‌కు చెందినదే అయి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఇది సెర్చ్ ఆపరేషన్‌లో ఉపయోగపడే అవకాశాలు లేవని కూడా అంటున్నారు. కాగా, మలేషియా ఎయిర్ లైన్స్ విమానం గల్లంతై ఏడాది దాటింది.












Click it and Unblock the Notifications