ఇరాన్ మూలాలను దెబ్బకొట్టిన ఇజ్రాయెల్
ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. యుద్ధం 18వ రోజుకు చేరుకోగా దీనికి ముగింపు కనపించట్లేదు. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, భద్రతకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇది అనేక దేశాల్లో వేలాది మంది ప్రయాణికులను చిక్కుకుపోయేలా చేస్తోంది.
ఈ యుద్ధంలో ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది ఇరాన్‌లోనే కాగా, లెబనాన్, గల్ఫ్ దేశాల్లో కూడా మరణాలు నమోదయ్యాయి. దశాబ్దాల తర్వాత తొలిసారిగా గల్ఫ్ ప్రాంతం యుద్ధ ముఖద్వారంలో నిలిచింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

ఈ పరిణామాల మధ్య ఇరాన్ కు భారీ నష్టం సంభవించింది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ, బసిజ్ యూనిట్ కమాండర్ ఘోలమ్రెజా సోలెమానీని మరణించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. తాజా దాడుల్లో లారిజానీ, సోలెమాననీ మరణించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెంటనే ఈ మరణాన్ని ధృవీకరించినట్లు ది జెరూసలేం పోస్ట్ వెల్లడించింది.
లారిజానీ మంగళవారం ప్రసంగించాల్సి ఉందని ఇరాన్ అధికారులు ప్రకటించగా ఐడీఎఫ్ మాత్రం తాజా దాడుల్లో ఆయన చనిపోయాడని పేర్కొంది. లారిజానీ మరణం ఖరారయ్యాక మొస్సాద్ ట్వీట్ చేసింది. "చివరికి దయ లేనివారు చనిపోతారు" అని తెలిపింది. ఆ కొద్దిసేపటికే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ బసిజ్ మిలీషియా అధిపతి ఘోలమ్రెజా సోలేమానీ, అతని డిప్యూటీ సయ్యద్ కరీషీలు కూడా మరణించినట్లు వెల్లడించింది.
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ దాడులు ఆరంభమైనప్పటి నుంచీ భారీ ప్రాణనష్టాన్ని చవి చూస్తూ వస్తోంది ఇరాన్. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, ఇరాన్ మిలిటరీ చీఫ్, ఐఆర్జీసీ చీఫ్, రక్షణ మంత్రి, సుమారు 40 మంది ఉన్నతాధికారులు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడుల్లో మరణించారు. అప్పటి నుండి లారిజానీ ఇరాన్ పాలన, ఆర్మీలో కీలక పాత్రను పోషిస్తూ వస్తోన్నారు. రోజువారీ కార్యకలాపాలు, పశ్చిమ దేశాలతో వివాదంపై చర్చలను నిర్వహించారు గతంలో.
ఐఆర్జీసీ కమాండర్‌గా, పార్లమెంట్ స్పీకర్‌గా, జాతీయ భద్రతా మండలి చీఫ్‌గా పనిచేశారు. 2021లో అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా అనర్హుడయ్యాడు. 2025 జూన్‌లో ఖమేనీకి సీనియర్ సలహాదారులలో ఒకరిగా నియమితులయ్యారు. ఖమేనీకి కుడిభుజంగా వ్యవహరించారు.
-
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ‘బాబ్ అల్ మాండెబ్’..? -
ముంచుకొస్తున్న గ్యాస్ సంక్షోభం.. పాత బుకింగ్‌లకే దిక్కులేని పరిస్థితి! -
యూఎస్ తో తలపడుతున్న ఇరాన్ బలాలేంటి? యుద్ధంలో ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? -
పెట్రోల్ పై రూ. 80 తగ్గింపు: బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం -
పేపర్ కప్పులో టీ, కాఫీ తాగుతున్నారా? అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అమెరికా, చైనాల్లో `మావిగన్` తరహా మహా నగరాలు- ఆయువుపట్టు.. !! -
పారాసెటమాల్, బీపీ టాబ్లెట్ల రేట్లు భారీగా పెంపు? -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం












Click it and Unblock the Notifications