Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రానున్న 12 గంటలు రైలులో ప్రయాణం చేయ‌కండి: ప్ర‌జ‌ల‌కు కీల‌క హెచ్చ‌రిక‌లు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ వాతావారణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరాన్ కు ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తామని ట్రంప్ తాజాగా హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ మాటలను ఇరాన్ ఏమాత్రం లెక్కచేయడం లేదు. దాడులను కొనసాగిస్తూనే ఉంది.

ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై దాడులను చేస్తుండగా.. అంతే రేంజ్ లో ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులను కొనసాగిస్తోంది. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు సమీపంలోని అల్బోర్జ్ ప్రావిన్స్ ను లక్ష్యంగా చేసుకుని జరిపిన వైమానిక దాడిలో 18 మంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా అధికారికంగా వెల్లడించింది. కాగా ఈ దాడిలో మరో 24 మంది గాయపడినట్లు సమాచారం అందుతోంది. అయితే ట్రంప్ డెడ్ లైన్ దగ్గర పడుతున్న క్రమంలో ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది.

ఇరాన్ లోని ప్రజలు ఎవరూ రైళ్లను ఉపయోగించవద్దని అంతేకాకుండా రైల్వే లైన్ల సమీపానికి కూడా ఎవరూ వెళ్లొద్దని ఇజ్రాయెల్ సైన్యం కీలక ప్రకటన చేసింది. ఇరాన్ లోని ప్రజల భద్రత దృష్ట్యా ప్రయాణాలకు రైళ్లను ఉపయోగించవద్దని కోరింది. ఈ మేరకు ఇరాన్ ప్రజలు రైలు ప్రయాణాలను తక్షణం మానుకోవాలని సూచనలు చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ .. పర్షియన్ భాషలో ఎక్స్ వేదికగా పోస్టు పెట్టినట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ స్పష్టం చేసింది.

Israel Issues Strong Advisory to Iran Do Not Use Trains or Approach Railway Tracks Israel warn Iran

ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన డెడ్ లైన్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో దాంతో మంగళవారం రాత్రి ఇరాన్ కు కీలకంగా మారింది. ఇరాన్‌ ను ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేస్తామంటూ ట్రంప్ తాజాగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో హెచ్చ‌రించారు. ఆ రాత్రి మంగ‌ళ‌వారం రాత్రే కావొచ్చంటూ తీవ్రంగా హెచ్చ‌రించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రజలు తీవ్ర భయాంధోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌ పై అమెరికా-ఇజ్రాయెల్ సైన్యం సంయుక్తంగా మరోసారి భీక‌ర దాడుల‌కు సిద్ధ‌మైన‌ట్లుగా సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+