మరో యుద్ధం ఆపిన ట్రంప్..! పశ్చిమాసియాలో ఇంకో సీజ్ ఫైర్..!
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యుద్దం జరిగినా అందులో తలదూర్చి కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ అదే బాటలో మరో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ చేయించారు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-సిరియా మధ్య నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ రెండు దేశాలతో చర్చలు జరిపించి ఎట్టకేలకు కాల్పుల విరమణకు అంగీకరించేలా చేశారు.
పశ్చిమాసియా దేశమైన సిరియాలో ప్రభుత్వ దళాలకూ, ప్రత్యర్థి సాయుధ గ్రూపులకూ మధ్య సాగుతున్న అంతర్యుద్ధంలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెల్ తాజాగా దాడులు చేసింది. ప్రభుత్వ అనుకూల బెడోయిన్ తెగలకూ, ఇజ్రాయెల్ మద్దతున్న డ్రూజ్ గ్రూపులకూ మధ్య పోరు సాగుతోంది. ఇందులో తమ దేశ సరిహద్దుల్లో ఉంటున్న డ్రూజ్ గ్రూపులకు మద్దతుగా ఇజ్రాయెల్ సిరియాపై దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్-సిరియా మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికా జోక్యం చేసుకుంది. సిరియా ప్రభుత్వ దళాలు, ప్రత్యర్థి సాయుధ గ్రూపుల మధ్య ఈ వారం జరిగిన పోరాటంలో ఇజ్రాయెల్ జోక్యం తర్వాత ఈ రెండు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయని సిరియాలో అమెరికా రాయబారి టామ్ బరాక్ వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడుల తర్వాత డ్రూజ్ గ్రూపులు, బెడౌయిన్ తెగల మధ్య తిరిగి ఘర్షణలు చెలరేగాయి. దీంతో సిరియా అధ్యక్షుడు ఘర్షణలు అణిచివేసేందుకు దళాలను తిరిగి పంపుతానని ప్రకటించారు.
ఇజ్రాయెల్-సిరియా మధ్య కొత్త కాల్పుల విరమణకు టర్కీ, జోర్డాన్, ఇతర పొరుగు దేశాలు మద్దతు ఇచ్చాయని డ్రూజ్, బెడౌయిన్లు, సున్నీలు తమ ఆయుధాలు విడిచిపెట్టి, ఇతర మైనారిటీలతో కలిసి పొరుగుదేశంతో శాంతి, శ్రేయస్సుకు ప్రయత్నించాలని అమెరికా రాయబారి కోరారు. గత ఆదివారం సిరియాలోని దక్షిణ స్వీడా ప్రావిన్స్‌లోని డ్రూజ్ గ్రూపులు, స్థానిక సున్నీ ముస్లిం బెడౌయిన్ తెగల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ప్రభుత్వ దళాలు నామమాత్రంగా జోక్యం చేసుకుని శాంతిభద్రతలను పునరుద్ధరించాయి. కానీ చివరికి డ్రూజ్‌లకు వ్యతిరేకంగా బెడౌయిన్‌ల వైపు నిలిచాయి.

దీంతో డ్రూజ్ గ్రూపుల్ని రక్షించడానికి ఇజ్రాయెల్ జోక్యం చేసుకుంది. ప్రభుత్వ బలగాల కాన్వాయ్‌లపై డజన్ల కొద్దీ వైమానిక దాడులు చేసింది. సెంట్రల్ డమాస్కస్‌లోని సిరియన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంపైనా దాడి చేసింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ పోరులో వందల మంది చనిపోయారు. సిరియా ప్రభుత్వ బలగాలు డ్రూజ్ పౌరుల్ని ఉరితీశారని, ఇళ్లను దోచుకున్నారని, తగలబెట్టారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సిరియా.. అమెరికా, టర్కీ, అరబ్ దేశాల మధ్యవర్తిత్వంతో డ్రూజ్ గ్రూపులతో ఒప్పందానికి వచ్చి తన బలగాలను ఉపసంహరించుకుంది. అయితే సిరియా మళ్లీ బలగాలు పంపేందుకు సిద్ధం కావడంతో కాల్పుల విరమణ జరిగింది.
-
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. కీలక విషయాలపై చర్చ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక! -
నతాంజ్ అణు కేంద్రంపై బాంబుల వర్షం.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్! -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు










Click it and Unblock the Notifications