ట్రంప్‌పై జేడీ వాన్స్ విమర్శల అంతర్యం అదేనా!

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. సెనెట్, ప్రతినిధుల సభ రెండింటినీ డెమోక్రాట్లు కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమికి ఇరాన్‌తో జరిగిన యుద్ధమే ప్రధాన కారణమని స్పష్టంగా చెప్పారు. ట్రంప్ విధానాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

ఇది కేవలం ఓటమి విశ్లేషణ కాదు.. 2028 అధ్యక్ష ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వాన్స్ తన స్థానాన్ని బలోపేతం చేసుకునే వ్యూహంగా కనిపిస్తోంది. వాన్స్ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. "మేము ఓడిపోయిన అసలు కారణం యుద్ధం. అధ్యక్షుడు కూడా నిన్న రాత్రి అదే చెప్పారు" అని పోస్ట్ పెట్టారు. 2024లో ట్రంప్‌కు ఓటు వేసిన చాలా మంది ఓటర్లు ఈసారి కోపంతో డెమోక్రాట్ల వైపు మళ్లారని సర్వేలను కూడా ఉదహరించారు.

JD Vance Blames Iran War for Republican Midterm Defeat Walks Tightrope with Trump Ahead of 2028

ఇరాన్ యుద్ధం వల్ల పెరిగిన జీవన వ్యయాలు, ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, ఇజ్రాయెల్‌తో అమెరికా సంబంధాలపై అసంతృప్తి ఓటర్లను దూరం చేశాయని చెప్పారు. సెనెట్‌ను ఆరేళ్లపాటు కోల్పోయినా యుద్ధం చేయడం సరైందే అని ఎవరైనా వాదిస్తే వాదించుకోవచ్చు. అది నిజాయితీగా ఉంటుంది అని సవాలు విసిరారు. వాన్స్ వ్యాఖ్యలు ట్రంప్‌పై పరోక్ష విమర్శగా నిలిచాయి. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పిన ప్రతి మాట తప్పేనని ప్రైవేట్ సంభాషణల్లో వాన్స్ అన్నట్లు నివేదికలు వచ్చాయి.

వాషింగ్టన్ తన విదేశాంగ విధానాన్ని ఇజ్రాయెల్‌కు తాకట్టు పెట్టకూడదని, అంతులేని విదేశీ యుద్ధాల్లో అమెరికా తలదూర్చకూడదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల ముందు ట్రంప్ కూడా యుద్ధాల్లో తలదూర్చడం సరికాదని చెప్పినా, అధికారంలోకి వచ్చాక ఇరాన్‌పై సైనిక చర్యకు ముందుకు వెళ్లారు.ట్రంప్ మాత్రం యుద్ధాన్ని సమర్థించుకున్నారు. ఇరాన్ ఓటమికి ఒక కారణం. కానీ నేను మళ్లీ అదే చేస్తాను. వాళ్లకు అణ్వస్త్రాలు రాకుండా చూడాలి అని చెప్పారు.

అయితే తాజా ఓటమి నేపధ్యంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2028 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ పోటీ చేయలేరు. అమెరికా రాజ్యాంగం ప్రకారం రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా ఉండలేరు. దీంతో వాన్స్ రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రధాన పోటీదారుగా ముందుకు రావాలని భావిస్తున్నారు. అందుకే ట్రంప్ వివాదాస్పద నిర్ణయాల నుంచి తనను తాను వేరు చేసుకుంటున్నారు.

హైదరాబాద్‌కు జలగండం..భయపెడుతోన్న భవిష్యత్తు.. సాక్ష్యమిదే!
హైదరాబాద్‌కు జలగండం..భయపెడుతోన్న భవిష్యత్తు.. సాక్ష్యమిదే!

యుద్ధాన్ని ముగించడం, జీవన వ్యయం తగ్గించడం, అమెరికాకే తొలి ప్రాధాన్యం ఇవ్వడం, ఇజ్రాయెల్‌తో సంబంధాలు మార్చుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. ఇది వాన్స్ యొక్క 2028 గేమ్‌ప్లాన్‌లో భాగంగా విశ్లేషకులు చూస్తున్నారు. ట్రంప్‌కు విధేయత చూపిస్తూనే తన స్వంత మార్గం సుగమం చేసుకుంటున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+