ఉద్యోగ ప్రకటన: తన కోసం చదివితే 40వేల డాలర్లు

హై స్కూల్ స్థాయిలో 4.0 జిపిఏ లేదా 3.5, లేదా ఏదైనా యూనివర్సిటీ నుంచి ఉన్నత జిపిఏ కలిగిన విద్యార్థులు తన ఉద్యోగానికి అర్హులంటూ తన ప్రకటనలో తెలిపాడు. మీ వయస్సుతో పనిలేదు, మీరు పురుషులైతే చాలు ఎందుకంటే తాను పురుష పేరును కలిగి ఉన్నాను కాబట్టి అని పేర్కొన్నాడు.
హార్వర్డ్ యూనివర్సిటీకి తన స్థానంలో నాలుగు సంవత్సరాలపాటు హాజరయ్యేందుకు ఓ ప్రతిభ గల విద్యార్థి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. 2014 ఆగస్టు నుంచి తన క్లాసులు ప్రారంభమవుతాయని, ట్యూషన్ ఫీజు, పుస్తకాల ఖర్చులు, నివాసం, రవాణా, జీవించేందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని తెలిపాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఏడాదికి 10వేల డాలర్లను బోనస్‌గా చెల్లించనున్నట్లు కూడా పేర్కొన్నాడు. అన్ని క్లాసులు హాజరు కావాలి, అన్ని పరీక్షలు పాసవ్వాలి, అన్ని అసైన్డ్ వర్క్ పూర్తి చేయాలని, అదంతా తన పేరునే ఉండాలని తెలిపాడు.
ఇంకా ఈ అవకాశాన్ని అంగీకరించేందుకు మీకు ఎలాంటి చింతా అవసరం లేదని, అదంతా తాను చూసుకుంటానని చెప్పాడు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే తన ఈ మెయిల్ అడ్రస్‌ను సంప్రదించవచ్చని, మిగితా వివరాలను కలిసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చని పేర్కొన్నాడు. తాను తెలిపిన అన్ని వివరాలకు అంగీకరించినట్లయితే ఒక రహస్య ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుందని, అభ్యర్థిని ఎంపిక చేయడం లేదా తిరస్కరించడం తన చేతిలోనే ఉంటుందని ప్రకటనదారు లిబ్బి నెల్సన్ వివరించాడు.












Click it and Unblock the Notifications