తుమ్మితే ఊడిపోతున్న ఉద్యోగాలు.. బాత్‌రూమ్ కు ఎక్కువ వెళ్ళాడని జాబ్ ఊస్ట్!

ప్రస్తుతం ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయే ముక్కలాగా తయారయ్యాయి. మొన్నటికి మొన్న నిర్దేశించిన సమయం కంటే ముందుగా ఆఫీసుకు వస్తున్నాడన్న కారణంతో ఒక ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించగా, తాజాగా ఎక్కువసేపు రెస్ట్ రూమ్ కు వెళ్తున్నారని కారణంతో మరొక ఉద్యోగం ఉద్యోగం ఊస్ట్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలలోనూ శాసిస్తున్న సమయంలో మానవ వనరుల వినియోగం ప్రశ్నార్థకంగా మారుతుంది.

అధికంగా రెస్ట్ రూమ్ బ్రేకులు తీసుకుంటున్న ఉద్యోగి జాబ్ ఊస్ట్
ఇదే సమయంలో ఉద్యోగులను నిష్కారణంగా తొలగించడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. ఉద్యోగ భద్రత లేదు అన్న అభిప్రాయానికి కారణమవుతుంది.తాజాగా చైనాలో ఒక ఉద్యోగిని అధికంగా రెస్ట్ రూమ్ బ్రేకులు తీసుకుంటున్న కారణంగా సంస్థ తొలగించింది. తూర్పు చైనాలోని లీ అనే వ్యక్తి 2010లో ఒక సంస్థలో చేరాడు. ఎవరైనా మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్ లకు తక్షణం స్పందించడం అతని బాధ్యత.

Job Security Under Threat Employee Fired for Bathroom Breaks

14 సార్లు బాత్రూం బ్రేకులు
అయితే లీ పని ప్రదేశానికి దూరంగా ఉంటున్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. చాట్ ద్వారా సంప్రదించినా అతని నుంచి స్పందన రావడం లేదని గుర్తించిన యాజమాన్యం సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించింది. గత సంవత్సరం ఏప్రిల్ మే మధ్య 14 సార్లు బాత్రూం బ్రేకులు తీసుకున్నట్టు తెలిసింది. ప్రతి బ్రేక్ కనీసం అరగంట, ఓసారి ఏకంగా నాలుగు గంటల సమయం పట్టిందని సంస్థ గుర్తించింది.

కోర్టు మెట్లెక్కిన లీ
దీంతో సంస్థలో పని చేసే సమయంలో నియమావళిని ఉల్లంఘించిన కారణంగా లీ కాంట్రాక్టును రద్దు చేసి కార్మిక సంఘానికి తెలియజేసింది సంస్థ. అయితే తనను ఉద్యోగం నుంచి అక్రమంగా తొలగించారని లీ స్థానిక కోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాల వల్ల ఎక్కువగా రెస్ట్ రూమ్ కు వెళ్లాల్సి వచ్చిందని ఆయన వాదించారు. తనను అక్రమంగా తొలగించినందుకు 3,20,000 యువాన్ లు ఇండియన్ కరెన్సీలో 41 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

కోర్టు తీర్పు ఇలా
అయితే సంస్థ తరఫున న్యాయవాది తన ఆరోగ్య పరిస్థితిని ముందే సంస్థకు తెలియజేయలేదని కూడా స్పష్టం చేశారు. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు లీ అనారోగ్యానికి అవసరమైన దానికంటే ఎక్కువ సమయం బాత్రూంలో గడిపారని అభిప్రాయపడింది. తన ఆరోగ్య పరిస్థితిని ముందే సంస్థకు తెలియజేయలేదని కూడా స్పష్టం చేసింది. కనుక మూడు లక్షల 20 వేల యువాన్ లు చెల్లించవలసిన అవసరం లేదన్నారు.

గతంలోనూ బాత్ రూమ్ బ్రేకులతో జాబ్ పోగొట్టుకున్న ఉద్యోగి
సంస్థలో ఇంతకాలం అందించిన సేవలకు, నిరుద్యోగం వల్ల తలెత్తిన ఇబ్బందులకు 30 వేల యువాన్ లు అంటే మన కరెన్సీలో సుమారు నాలుగు లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ప్రస్తుతం లీ మాత్రమే కాదు, గతంలో ఒక ఉద్యోగి ఆరు గంటల బాత్రూం బ్రేక్ తీసుకున్నందుకు చైనాలో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అందుకే ఉద్యోగం చేసేవారు తస్మాత్ జాగ్రత్త.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+