Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జోర్డాన్ పార్లమెంటులో ఘర్షణ.. ఎంపీలు బాహాబాహీ.. పిడిగుద్దుల వర్షం

చట్టసభల్లో అధికార, విప‌క్ష‌ సభ్యుల మధ్య పరస్పర విమర్శలు, ఆరోప‌ణ‌లు, వాగ్వాదాలు సహజం. ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడం పరిపాటి. హూందాగా వ్యవహారించాల్సిన ప్ర‌జా ప్ర‌తినిధులు ఒక్కొసారి విచ‌క్ష‌ణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఘటన జోర్డన్ పార్లమెంట్‌లో చోటు చేసుకుంది. సహనం కోల్పోయి పరస్పరం బాహాబాహీకి దిగారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు.

రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌పై విప‌క్షాలు అభ్యంత‌రం

రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌పై విప‌క్షాలు అభ్యంత‌రం

జోర్డానియన్ల విధులు, హక్కులపై రాజ్యాంగ స‌వ‌ర‌ణ కోరుతూ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుపై పార్ల‌మెంటులో చ‌ర్చ జరిగింది. ఈ సమయంలో ప్రతిప‌క్ష‌పార్టీకి చెందిన‌ ఎంపీ ఈ స‌వ‌ర‌ణ‌ను త‌ప్పుప‌ట్టారు. ఈ బిల్లు పనికిరాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార పార్టీ ఎంపీల ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు దిగారు . స‌ద‌రు ఎంపీ క్ష‌మాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దింతో రెండు వ‌ర్గాల ఎంపీల‌ మధ్య వాగ్వాదం చేసుకుంది.

ఎంపీల బాహాబాహీ ..

ఈ వివాదం కాస్తా చినికి చినికి ఎంపీల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు తోచుకున్నారు. సీట్లలో నుంచి లేచి ఎంపీలు చొక్కాలు పట్టుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఎంపీల బాహాబాహీలతో పార్లమెంటు వాయిదా పడింది. ఈ ఘర్షణల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి. కాగా, పార్లమెంట్‌లో ఎంపీల బాహాబాహీకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

ఘ‌ర్ష‌ణ‌కు కార‌ణం..

ఘ‌ర్ష‌ణ‌కు కార‌ణం..

జోర్డన్ రాజ్యాంగంలోని రెండ‌వ చాప్ట‌ర్‌లో ఉన్న జోర్డానియ‌న్ల హక్కులు, విధులు అంశానికి మ‌హిళా జోర్డానియ‌న్లు అన్న కొత్త ప‌దాన్ని క‌లిపారు. అయితే ఫిమేల్ జోర్డానియ‌న్లు అన్న ప‌దాన్ని చేర్చడంపై కొందరు ఎంపీలు వ్యతిరేకించారు. మహిళా జోర్డానియన్ల పదాన్ని తొల‌గించాలంటూ డిమాండ్ చేశారు. ఇది లింగ వివ‌క్ష‌కు దారి తీస్తుంద‌ని ఆరోపించారు. దీంతో ఎంపీలు రెండు వ‌ర్గాలుగా మారి ముష్టిఘాతానికి దిగారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+