అత్యాచారం చేశాడు...రుజువులున్నాయి..కానీ శిక్ష వేయలేనన్న జడ్జి
ఆమెపై అత్యాచారం చేశాడు... నిందితుడు దొరికాడు.. కోర్టులో హాజరుపరిచారు.... ఆ యువతిపై అత్యాచారం చేశాడని చెప్పేందుకు అన్ని సాక్షాధారాలు ఉన్నాయి.కానీ శిక్ష వేయాల్సిన జడ్జి మాత్రం అసలు కేసును విచారణ చేయనన్నారు. ఇంతకీ ఆ యువతి ఎవరు..? ఈ ఘటన ఎక్కడ జరిగింది..?

నౌకలో యువతిపై అత్యాచారం చేసిన ఇటలీ యువకుడు
బ్రిటన్‌కు చెందిన 17ఏళ్ల యువతి యూరప్‌కు చెందిన నౌకలో ప్రయాణం చేసింది. ఆమెతో పాటు తన తల్లిదండ్రులు కూడా ప్రయాణిస్తున్నారు. వీరంతా పల్మా రాజధాని మలోర్కన్ నుంచి స్పెయిన్‌లోని వాలెన్సియాకు వెళుతున్నారు. ప్రయాణం సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో విలన్‌లా ఎంటర్ అయ్యాడు ఇటలీకి చెందిన ఓ యువకుడు. అమ్మాయి నౌకలో నడుస్తుండగా ఆమెను తన క్యాబిన్‌లోకి లాక్కున్నాడు. ఆపై అత్యాచారం చేశాడు.

యువకుడు అరెస్టు..శిక్ష వేయలేనన్న జడ్జి..?
నౌక సముద్రం మధ్యలో ఉండటంతో మరుసటి రోజు పనామాకు చేరుకున్న తర్వాత ఆ కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టుకు తరలించారు. ఇక్కడే ట్విస్టు చోటుచేసుకుంది. కేసు విచారణ చేసిన జడ్జి అన్ని సాక్షాధారాలు పక్కాగా ఉన్నప్పటికీ నిందితుడిని విడుదల చేస్తూ తీర్పు వెల్లడించారు. అయితే ఆ నిందితుడిని ఎలా విడుదల చేశారు అనే అనుమానం చాలా మందికి కలిగింది. నిందితుడిపై చేయబడ్డ ఆరోపణ లేదా అత్యాచారంకు పాల్పడిన ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుందో తెలియడం లేదన్నారు. ఒక విదేశీ యువతిపై మరో విదేశీ యువకుడు అంతర్జాతీయ జలాల మధ్య అత్యాచారం చేశాడని ఇది తమ పరిధిలోకి రాదని అందుకే శిక్షించడం కుదరదని జడ్జి వెల్లడించారు.

స్పెయిన్ చట్టాల్లో మార్పులు
ఇదిలా ఉంటే 2009లో స్పెయిన్ తన చట్టాల్లో మార్పు చేసింది. తమ దేశంలో కాకుండా విదేశాల్లో స్పెయిన్ దేశస్తుడు నేరం చేస్తే దానికి సంబంధించిన విచారణ విదేశీ కోర్టుల్లోనే జరగాలంటూ మార్పులు చేసింది. ఇక నౌకలో జరిగిన అత్యాచార ఘటనపై జడ్జి కేవలం నేరం ఎక్కడ జరిగిందనే దానినే పరిగణలోకి తీసుకున్నారని స్పెయిన్ మీడియా తెలిపింది. అయితే తాజాగా బ్రిటీష్, ఇటాలీ, పనామా అధికారులను జడ్జి పిలిపించి అసలు ఆ యువకుడి గురించి పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా కోరినట్లు స్పెయిన్ మీడియా కథనాలను ప్రసారం చేసింది.
ఇక అమ్మాయిపై అత్యాచారం గత గురువారం రోజున ఉదయం 5 గంటలకు జరిగింది. వాలెన్సీయాకు ఉదయం 7గంటల35 నిమిషాలకు చేరుకుని అదే రోజు సాయంత్రం 4 గంటలకు మార్సెల్లీకి బయలుదేరి వెళ్లింది. అప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక నౌకలో బాధితురాలు ఆమె తల్లిదండ్రులు వెళ్లారు. అంతకుముందు యువతికి ఆస్పత్రిలో పరీక్షలు చేశారు. ఆమె బట్టలను పలు టెస్టుల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications