నిమిష ప్రియ ఉరిశిక్షపై మరో బిగ్ టర్న్..! మృతుడి కుటుంబం సంచలన నిర్ణయం..!

యెమెన్ లో తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు ఇవాళ పడాల్సిన ఉరిశిక్షను నిన్న చివరి నిమిషంలో వాయిదా వేశారు. అబ్దో మెహదీ అనే వ్యాపార భాగస్వామి తనను మోసం చేసి ఇమ్మిగ్రేషన్ పత్రాలు లాక్కోవడంతో అతని నుంచి తప్పించుకునే క్రమంలో మత్తు మందు ఇచ్చేందుకు ప్రయత్నించి చావుకు కారణమైన కేసులో నిమిష ప్రియకు ఉరిశిక్ష పడింది. అయితే నిమిష ప్రియను రక్షించేందుకు కేంద్రంతో పాటు ముస్లిం నేతలు, కేఏ పాల్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

నిమిష ప్రియకు ఇవాళ ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా.. దాన్ని తప్పించేందుకు లేదా కనీసం వాయిదా వేయించేందుకు గత కొన్ని రోజులుగా కేరళకు చెందిన ముస్లిం నాయకుడు అబూబకర్ సిద్దిఖీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యెమెన్ లో సూఫీ మత గురువుల మధ్యవర్తిత్వంతో నిమిష ప్రియను ఎలాగైనా కాపాడాలని లాబీయింగ్ చేశారు. అయితే మృతుడి కుటుంబం అంగీకరించకపోతే ఉరిశిక్ష రద్దు కావడం అనేది జరగని పని. దీంతో మృతుడి కుటుంబాన్ని కూడా వీరు సంప్రదించారు. నిన్న వీరితో చర్చలు జరిపి తాత్కాలికంగా ఉరిశిక్ష వాయిదాకు అంగీకరించిన మృతుడి కుటంబం ఇవాళ మాత్రం క్లారిటీ ఇచ్చేసింది.

kerala nurse Nimisha Priya s death sentence inevitable victim s family refused pardon

నిమిష ప్రియను ఉరి తీయాల్సిందేనని మృతుడు అబ్దో మెహదీ కుటుంబం తేల్చిచెప్పేసింది. ఆమెకు క్షమాభిక్ష పెట్టడం సరికాదని మృతుడి సోదరుడు అబ్దల్ ఫతాహ్ మెహదీ స్పష్టం చేశారు. భారత మీడియా నిమిష ప్రియను బాధితురాలిగా చిత్రీకరించడానికి విషయాలను వక్రీకరిస్తోందని అతను తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిమిష ప్రియ చేసిన తప్పుకు క్షమాభిక్ష ఉండబోదని మృతుడి కుటుంబం స్పష్టం చేసింది.

అంతకు ముందు మృతుడి కుటుంబానికి బ్లడ్ మనీ (క్షమాభిక్షకు పరిహారంగా ఇచ్చే మొత్తం ) 8.6 కోట్లు ఇచ్చేందుకు నిమిష ప్రియ కుటుంబం సిద్దమైంది. అయితే దీనిపై మృతుడి కుటుంబం మౌనంగా ఉంది. దీంతో నిమిష ప్రియకు ఇవాళ ఉరి తప్పదనిపించింది. అయితే మధ్యలో కేరళ ముస్లిం నేత అబూబకర్ ముస్లియార్ జోక్యంతో అక్కడి ముస్లిం పెద్దలు తాత్కాలికంగా ఉరి వాయిదా వేయించి సంప్రదింపులు జరిపారు. అయితే ఇందులో మృతుడి కుటుంబం క్షమాభిక్షకు అంగీకరించలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+