ఆ ఇంట్లోని ఆడవాళ్ల లోదుస్తులు దొంగిలించి కెమెరాకు దొరికిపోయాడు
స్కాట్లాండ్: ఓ వ్యక్తి లేడీస్‌కు చెందిన లోదుస్తులు దొంగిలిస్తూ సీసీ కెమెరాలకు పట్టుబడ్డ సంఘటన స్కాట్లాండులోని ఓ నగరంలో జరిగింది. నిత్యం మహిళల లోదుస్తులు దొంగతనానికి గురవుతుండటంతో ఇంటి యజమానులు ఓ కెమెరాను అమర్చారు. దీంతో నిందితుడు క్రిష్టోఫర్ మెక్ హార్గ్ పట్టుబడ్డాడు.
ఐర్ షైర్‌కు చెందిన క్రిష్టోఫర్ గత కొద్ది రోజులుగా ఓ ఇంటిలో మహిళలకు చెందిన లోదుస్తులను దొంగిలిస్తున్నాడు. అతను చీకటి సమయాల్లో తన మొబైల్ ఫోన్, టార్చ్‌ను ఉపయోగించి బ్రాలు, ప్యాంటీలు దొంగిలిస్తున్నాడు.

దీంతో ఆ ఇంటి యజమానులు ఎవరికీ కనిపించని స్థానంలో కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే, లీగల్ కారణాలతో ఆ కుటుంబ సభ్యులు ఎవరు అనేది వెల్లడించలేదు. కొద్ది రోజుల అనంతరం కెమెరా ద్వారా ఎవరు దొంగిలిస్తున్నారో గుర్తించారు.
అయితే, లోదుస్తులను దొంగిలిస్తున్న మెగ్ హార్గ్ ఆ కుటుంబ సభ్యులకు ఏళ్లుగా తెలిసిన వ్యక్తి కావడం గమనార్హం. దీంతో వారు ఆశ్చర్యపోయారు. నిందితుడి వయస్సు 28. సీసీ కెమెరా ఫుటేజీని చూసిన కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు. అతని పైన కేసు నమోదు చేశారు. కోర్టు అతనికి శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications