మనిషేనా? ఆత్మహత్యకు పాల్పడుతుంటే ఆపాల్సిందిపోయి.. వీడియో తీసి..

పని మనిషి ఆత్మహత్య చేసుకుంటుంటే కాపాడాల్సింది పోయి దాన్ని వీడియో తీసి మానవత్వానికే మాయని మచ్చ తీసుకొచ్చింది ఓ యజమానురాలు.

కువైట్: మన కళ్లముందు ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనమేం చేస్తాం. పరుగుపరుగున పోయి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాం.. కాపాడతాం. కానీ కువైట్ లో ఓ మహిళ ఏం చేసిందో తెలుసా? పని మనిషి ఆత్మహత్య చేసుకుంటుంటే దాన్ని వీడియో తీసి మానవత్వానికే మాయని మచ్చ తీసుకొచ్చింది.

అక్కడితో ఆగలేదు.. తాను తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన దగ్గర పనిచేస్తున్న ఇథియోపియాకు చెందిన మహిళ ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించగా ఆమె యజమానురాలు వీడియో తీసింది.

video taking

చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఆత్మహత్యా యత్నం విరమించిన బాధితురాలికి కనీసం సహాయం కూడా అందించకుండా ఆ యజమానురాలు అమానవీయత ప్రదర్శించింది. కాపాడమని ప్రాధేయపడినా కనికరించకుండా వీడియో తీస్తూనే ఉంది.

భయంతో కేకలు వేసినా పట్టించుకోలేదు. చేతులు పట్టుతప్పి ఆ మహిళ కిందకుపడిపోయినా యజమానురాలు వీడియో తీయడం ఆపలేదు. సహాయ బృందాల సాయంతో గాయాలతో బయటపడిన బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు. మానవ హక్కుల సంఘాల ఫిర్యాదు మేరకు అమానవీయంగా ప్రవర్తించిన యజమానురాలిని మాత్రం అక్కడి పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+