Viral Video: ప్రకృతి భీభత్సానికి 1000 మంది బలి.. ఒక్కడే మిగిలాడు !
ప్రపంచ దేశాలను ప్రకృతి విప్తత్తులు అల్లాడిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే వరుస భూకంపాలు అఫ్గానిస్తాన్ ను వణికించాయి. భూకంపం కారణంగా సుమారు 800 మందికి పైగా మరణించగా.. వేల మంది గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం సైతం సంభవించింది. గత దశాబ కాలంలో జరిగిన అత్యంత తీవ్రమైన భూకంపంగా అఫ్గాన్ దీన్ని ప్రకటించింది. ఇప్పుడు ఈ తరహాలోనే ఆఫ్రికా దేశంలోని సూడాన్‌లో కూడా తీరని విషాదం చోటు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
సూడాన్‌లో ఘోర విషాద ఘటన జరిగింది. మర్రా పర్వతాల ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడడంతో ఏకంగా ఓ గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది. ఈ దుర్ఘటనలో 1000 మందికి పైనే మృతి చెందినట్టు సూడాన్ లిబరేషన్ ఆర్మీ ధ్రువీకరించింది.

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆగస్టు 31న కొండచరియలు విరిగిపడ్డట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు, పురుషులు ఉన్నారని పేర్కొన్నారు. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టు ప్రకటించారు.
కాగా ఉత్తర డార్ఫుర్ రాష్ట్రంలో సైన్యానికి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్)కు మధ్య భీకర అంతర్యుద్ధం జరుగుతుంది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు మర్రా పర్వత ప్రాంతాలకు శరణార్థులుగా వలస వచ్చారు. రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ అంతర్యుద్ధం కారణంగా దేశంలో సగం జనాభా తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ పరిస్థితుల్లో ప్రకృతి విపత్తుతో ఇంతమంది చనిపోవడం అందరినీ కలచివేస్తోంది.
ఈ విపత్కర పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి, ఇతర సహాయక సంస్థలు సూడాన్‌ను ఆదుకోవాలని.. అవసరమైన సాయం చేయాలని ఆర్మీ కోరింది. అలానే మట్టి, శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయడానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. డార్ఫర్ గవర్నర్ మిన్ని మిన్నావి ఈ ప్రమాదంపై స్పందిస్తూ.. ఇది అత్యంత తీవ్రమైన ప్రమాదమని వాపోయారు. గ్రామం శవాల దిబ్బగా మారిందని.. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో జరుగుతున్న పోరాటాలు వల్ల అత్యవసర సహాయం అందించడానికి కూడా వీలు లేకుండా ఉందని తెలిపారు. అంతర్జాతీయ సహాయక సంస్థలు సహాయం అందించాలని కోరారు.
📌 #Sudan’da Toprak Kayması Köyü Yuttu: 1000 Kişi Can Verdi
— Afroasya Today (@afroasyatoday) September 2, 2025
⚫ #Darfur'daki Marra Dağları’nda meydana gelen toprak kaymasında en az 1000 kişi hayatını kaybetti, sadece 1 kişi kurtuldu.
⚫ Kuzey Darfur'da BAE destekli RSF/HDK'nin zulmünden kaçarak Marra'ya sığınan sivillerin… pic.twitter.com/gVsQ6cTSZJ
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications