మహిళతో స్టెప్పులేస్తూ దొరికిపోయిన ముషార్రఫ్
ముషార్రఫ్ ఓ ఓ మహిళతో హిందీ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ దొరికిపోయారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ ఓ మహిళతో స్టెప్పులేస్తూ అడ్డంగా దొరికిపోయారు. గుర్తు తెలియని మహిళతో కలిసి బాలీవుడ్ సినిమా 'యే జవానీ హై దీవానీ' సినిమాలోని 'దిల్లీ వాలీ గర్ల్‌ఫ్రెండ్' పాటకు ఓ నైట్‌క్లబ్‌లో స్టెప్పు లేశారు.
పాకిస్థాన్‌లో విశేష ప్రజాదరణ పొందిన టెలివిజన్ టాక్‌షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించే హమిద్ మిర్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా మిర్ గత సెప్టెంబరులోనూ ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో ముషారఫ్ తన భార్య సెహ్‌బా ముషారఫ్‌తో కలిసి ఓ పార్టీలో చిందులేశారు.

నవంబరు 2007లో దేశంలో అత్యవసర స్థితి విధించి, న్యాయమూర్తులను అరెస్ట్ చేయడంతోపాటు వారి అధికారాలను పరిమితం చేసిన కేసులో ముషారఫ్ రాజద్రోహం కేసును ఎదుర్కుటున్నారు. అతడి పేరును ప్రభుత్వం 'ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్'లో చేర్చింది.
గత 20 నెలలుగా ఆ జాబితాలో ఉన్న మాజీ అధ్యక్షుడి పేరును నిరుడు మార్చిలో తొలగించడంతో ముషారఫ్ చికిత్స నిమిత్తం దుబాయ్ వెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు.
More From
-
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
మ్యాచ్‌లు గెలవలేరు కానీ.. ఐసీసీ ట్రోఫీలు దొంగిలిస్తారా? -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications