వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొన్ని గంటల ముందే ఆల్బమ్: పాప్ సింగర్ ఉరేసుకుని ఆత్మహత్య

లాస్ ఎంజెలెస్: లింకిన్ పార్క్ ట్రూప్‌లో ప్రధాన సింగర్, గిటారిస్ట్ అయిన చెస్టర్ బెన్నింగ్టన్ (41) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు.

By Pratap
|
Google Oneindia TeluguNews

లాస్ ఎంజెలెస్: లింకిన్ పార్క్ ట్రూప్‌లో ప్రధాన సింగర్, గిటారిస్ట్ అయిన చెస్టర్ బెన్నింగ్టన్ (41) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. ఈ విషయాన్ని లింకిన్ పార్క్ ట్రూప్‌లో గీత రచయిత అయిన మైక్ షినోడ అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా నిర్ధారించారు.

లాస్‌ఏంజిలిస్ కౌంటీ పోలీస్ అధికారి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తన ఇంట్లో ఉరేసుకుని బెన్నింగ్టన్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తమకు ఫోన్ వచ్చిందని తెలిపారు. ప్రాథమికంగా ఆత్మహత్యగానే కేసును నమోదు చేసినట్టు తెలిపారు.

Linkin Park singer Chester Bennington commits suicide

తన మరణానికి కొన్నిగంటల ముందే లింకిన్ పార్క్.. 'టాకింగ్ టు మై సెల్ఫ్' అనే వీడియో ఆల్బమ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో ముఖ్యంగా బెన్నింగ్టన్ భార్య తలిందా అన్ బెంట్లే బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ పాటను చిత్రీకరించినట్టు తెలుస్తోంది.

ఆరిజోనాలో పుట్టిపెరిగిన బెన్నింగ్టన్‌కు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆరుగురు పిల్లలు ఉన్నారు. తన జీవితంలో జరిగిన సంఘటనలను రెండేళ్ల కిందట ఓ బ్రిటీష్ మ్యూజిక్ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. తన తల్లిదండ్రుల విడాకులతో తీవ్ర మనస్తాపం చెంది మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడినట్టు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

తనకు ఏడేళ్ల వయసున్నప్పుడు తనను తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఓ వ్యక్తి తీవ్రంగా హింసించాడని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వ్యక్తి ఎప్పుడూ తనను శారీరకంగా హింసించేవాడని, చేయకూడని పనులను తనతో బలవంతంగా చేయించేవాడని అన్నారు.

దానివల్ల తనలోని ఆత్మవిశ్వాసాన్ని అతడు దెబ్బతీశాడని చెప్పారు. చాలా మంది లాగే అనేక విషయాలను చెప్పేందుకు తాను భయపడేవాడినని వివరించారు. అలాంటి ఘటనల నుంచి తేరుకుని మ్యూజిక్ ట్రూపులో ప్రధాన సభ్యుడిదాకా ఎదిగానని వివరించారు.

English summary
Linkin Park lead singer Chester Bennington was found dead at his Los Angeles home on Thursday. He died due to an apparent suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X