లాటరీ: ఆనందంతో బాస్ మీద యూరిన్ పోశాడు (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: ఆనందం వచ్చినా, ఆగ్రహం వచ్చినా కొందరిని పట్టలేరు. ఆ సమయంలో ఏది జరిగినా వారు తట్టుకోలేరు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.

ఓ కార్పొరేట్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ వ్యక్తి అనుకోకుండా లాటరీ విన్ అయ్యాడు. విషయం తెలుసుకుని సంతోషంతో ఊగిపోయి గంతులు వేశాడు. అంతటితో శాంతించక గంతులు వేస్తూ వెళ్లి అతని బాస్ కు చుక్కలు చూపించాడు.

లండన్ లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి లాటరీ విన్ అయ్యాడని సమాచారం వచ్చింది. కార్యాలయంలో ఉన్న అతను కుర్చున్న కుర్చీలోనే గంతులు వేశాడు. అటూ ఇటూ పరుగులు పెట్టాడు. ఆనందం పట్టలేక సాటి ఉద్యోగుల చుట్టూ తిరిగాడు.

తరువాత నేరుగా బాస్ క్యాబిన్ లోకి వెళ్లాడు. బాస్ తో మాట్లాడుతున్న ఆయన పీఏని భయభ్రాంతులకు గురి చేశాడు. కుర్చిలో కుర్చున్న బాస్ ను కిందకు నెట్టి చితకబాదాడు. టేబుల్ మీదకు ఎక్కి కిందపడిన బాస్ మీద మూత్రం పోశాడు.

నానా హంగామా చేసిన తరువాత అతను కార్యాలయంలో నుంచి బయటకు వెళ్లి పోయాడు. ఈ హంగామా అంతా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
But he turns and returns to his desk where he gets something out of his bag. He barges into the office and appears to spray his boss in the face with mace.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి