Donald Trump Love story:ట్రంప్ ప్రేమాయణం.. నానా తిప్పలు పడి పెళ్లి

ప్రేమ ఎప్పుడైనా.. ఎవరిమీదైన.. ఎలా అయినా పుడుతుంది. దానికి తారతమ్యాలుండవు. ఆస్తిపాస్తులు చూడదు. ప్రేమకు ఎవరు అతీతులు కాదు. కాలం రాసిన చందమామ లాంటి ప్రేమ కథలు మనం ఎన్నో వెండితెరపైన, బుల్లితెరమీద, మన చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం. ప్రేమించే వ్యక్తి వెంటుంటే అదో బలం. ఎంతటి యుద్ధానైనా గెలుస్తాం. ఇందుకు నిలువెత్తు నిదర్శనాలు ఇప్పటికే చాలా చూశాం. కానీ ఇప్పుడు మనం అగ్రరాజ్యానికి అధిపతైన ట్రంప్ ప్రేమాయణం గురించి తెలుసుకుందాం.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్

1998 లో తొలిసారి ట్రంప్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ను ఫీల్ అయ్యారు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో తొలిసారి మెలనియాను చూశాడు. మెలనియా గ్లామర్ మోడల్. 28 ఏళ్ల మెలనియాను చూసేటప్పటికి ట్రంప్ వయసు 52 ఏళ్లు.. వీరిద్దరి మద్య ఉన్న 24 ఏళ్ల తేడాను ట్రంప్ పట్టించుకోలేదు. ట్రంప్ అప్పటికే వ్యాపారవెత్త, టెలివిజన్ స్టార్. అప్పటికే తన వైవాహిక జీవితంలో గొడవలు జరుగుతున్న సమయం అది. తన ప్రెండ్స్ ద్వారా ఆ అమ్మాయి వివరాలు తెలుసుకున్నాడు. స్లొవేనియా మోడల్ అని వారు చెప్పారు.

Love story 1998 It was not a smooth sail for Donald Trump to convince Melania here is why

నంబర్ కోసం.. నానా తిప్పలు...

ప్రేమలో ఎవరికైన హనుమంతుడి మాదిరి తోడుండి జంట చేసేది స్నేహితులే కదా.. ఆ అమ్మాయి రెండేళ్ల క్రితమే ఫ్యామిలీతో పాటు వచ్చిందని పూర్తి వివరాలు అందజేశారు. అంతే ఇక ట్రంప్ అల్లుకుపోయాడు. పరిచయం చేసుకున్నాడు. ఫోన్ నెంబర్ అడిగాడు. మెలనియా ఇవ్వలేదు! అతడి పక్కనే సెలీనా మిడెల్ఫార్ట్ అనే అమ్మాయి ఉంది. ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో అమ్మాయి ఫోన్ నెంబర్ అడుగుతాడేంటి అని కోపం వచ్చి నెంబర్ ఇవ్వలేదు. ట్రంప్ గురించి తెలిసిందేగా.. పట్టు వదలని విక్రమార్కుడిలా ట్రై చేశారు.

ఐ వాన ఫాలో ఫాలో.. ఫాలో ఫాలో యూ..

25 ఏళ్ల కుర్రాడి మాదిరి మెలనియా ఎక్కడికి వెళితే అక్కడ ప్రత్యక్షమయ్యే వాడు. ఆమెని ఇంప్రస్ చేయడానికి శతవిధాల ప్రయత్నించి చివరికి ఆమెను ప్రేమలో పడేశారు. ఇంకేముంది ప్రేమ స్టార్ అయింది. ప్రేమంటేనే గొడవలు.. బుజ్జగింపులు. బ్రేకప్లు.. ప్యాచప్లు.. ఇలా సాగిన వారి ప్రేమాయణం.. ఫస్ట్ టైమ్ 'హెూవార్డ్ స్టెర్న్ టీవీ షో' సాక్షిగా ప్రపంచానికి తెలిసింది. "మా మధ్య గొడవలు ఉండవు. మా గురించి ప్రపంచం గొడవలు పెట్టుకోవడం తప్ప" అన్నారు. 2005లో వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా 2006లో మెలనియా తల్లి అయింది. కొడుకు పుట్టాడు.

ఎవరెన్ని చెప్పిన భర్త వెంటే నిలిచారు..

మెలనియాకు 2005లో అమెరికన్ సిటిజన్ షిప్ దక్కింది. మెలనియా డిగ్రీ చదువును మధ్యలోనే ఆపి.. ఫ్యాషన్ మోడలింగ్ కి వచ్చేశారు. మెలినియాకు చాలా భాషలు వచ్చు. ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, స్లొవేనియా, సెర్బియా భాషలు ఆమె మాట్లడతారు. 2016 ఎన్నికల సమయంలో ట్రంప్ పై విమర్శలు బాగా ఎక్కువయ్యాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మహిళల పట్ల ట్రంప్ ఎంత అసభ్యంగా ప్రవర్తించారన్నది మీడియాల్లో ప్రసారం అవ్వడం మొదలయ్యాయి. భర్తను ఓడించడానికి సాటి మహిళలు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టడానికి ఆమెకు వచ్చిన భాషలేవి సరిపోలేదు. కుంగిపోకుండా.. భర్తపై వచ్చిన ఆరోపణలు నమ్మి ట్రంప్ ను వదలకుండా.. పతి వెంటే నిలిచారు. గెలిపించారు. ఇవాంకపై వస్తున్న వార్తలను సైతం తల్లి స్థానంలో ఉండి ఖండించారు. కన్న తల్లి కాకపోయినా.. తల్లి స్థానంలో ఉన్నాను కాబట్టి.. వారి గురించి నేను తప్పక ఆలోచిస్తా అని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+