వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలాలాకు 'లిబర్టీ' పతకం, చదువు కోసం విరాళం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మాలలా యూసఫ్‌ జాయ్‌కి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. నేషనల్ కాన్ట్సిట్యూషన్ సెంటర్ 'అమెరికా లిబర్టీ మెడల్' అవార్డుతో ఆమెను సత్కరించింది.

అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఈ లిబర్టీ పతకాన్ని మాలలా యూసఫ్‌ జాయ్‌ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల స్వాతంత్య హక్కుల పోరాటం చేసే వారికి ఏటా ఈ పతకాన్ని గౌరవ సూచకంగా అందిస్తారు.

అవార్డుతో పాటు రూ. 61 లక్షలు ఆమెకు దక్కాయి. అయితే, ఈ మొత్తాన్ని పాకిస్థాన్‌లో చదువు కోసం మలాలా విరాళమిచ్చింది. గతంలో ఈ పతకాన్ని అందుకున్న ప్రముఖుల్లో జార్జి బుష్, బిల్ క్లింటన్, నెల్సన్ మండేలా, కోఫి అన్నన్ ఉన్నారు.

Malala Yousafzai gets US Liberty Medal

17 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి మాలాలా యూసఫ్ జాయ్ పొంది రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. లక్షల మందికి చదువు ఎంత కష్టపడితేకానీ సమకూరదో తెలియచేయాలన్న లక్ష్యంతో తాను ఎదుర్కొన్న సాహసోపేత అనుభవాన్ని ప్రపంచంలోని నిరక్షరాస్యులైన బాలలందరికీ తెలియచేయాలని తన జీవిత చరిత్రను పుస్తక రూపంలో విడుదల చేసింది.

తన జీవిత చరిత్రను విడుదల చేసిన ఆమె, తల్లిదండ్రులతో కలిసి ప్రస్తుతం బర్మింగ్ హామ్‌లో ఉంటూ బాలికల విద్య కోసం పోరాడుతోంది. ఆమె నిరుడు ఈయూ ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన ‘సఖోరోవ్ హుమన్ రైట్స్' అందుకున్నారు.

English summary

 Pakistani teenager and Noble Peace Prize winner Malala Yousafzai has been conferred with the Liberty Medal, and the youngest recipient of the American award said this will encourage her to continue her campaign for child rights in countries including India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X