నెతన్యాహును మమ్దానీ అరెస్టు చేస్తారా ? ట్రంప్ అడ్డుకోగలరా ?
తాజాగా అమెరికాలోని న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన భారతీయ-ఉగాండ మూలాలున్న డెమోక్రాట్ అభ్యర్ధి జొహ్రాన్ మమ్దానీ ఈ ఎన్నికల్లో రెగ్యులర్ హామీలతో పాటు మరో కీలక హామీ కూడా ఇచ్చారు. పాలస్తీనాపై అకృత్యాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ కు వస్తే అరెస్టు చేసి తీరుతానని ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇదే కారణంతో నెతన్యాహుపై గతేడాది అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో నెతన్యాహు న్యూయార్క్ టూర్ ఉత్కంఠ రేపుతోంది.
వచ్చే ఏడాది జనవరి 1న న్యూయార్క్ మేయర్ గా జొహ్రాన్ మమ్దానీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అదే రోజు రిపబ్లికన్ పార్టీ నేత ఇన్నా వెర్నికోవ్ నెతన్యాహును న్యూయార్క్ కు ఆహ్వానించారు. దీంతో అంతర్జాతీయ కోర్టు అరెస్టు వారెంట్ ను నెతన్యాహుపై అమలు చేస్తానని మమ్దానీ చెప్తున్నారు. దీన్ని రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలే న్యూయార్క్ లో భారీ ఎత్తున యూదులతో పాటు పాలస్తీనా జనాభా కూడా ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 1న ఏం జరగబోతోందనే చర్చ జరుగుతోంది.

గత నెలలో జెటియోలో జర్నలిస్ట్ మెహదీ హసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో మమ్దానీ తన హామీని గుర్తుచేశారు. నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్‌ను మానవ కవచంగా చేసుకుని న్యూయార్క్‌కు వస్తే, ఆయనను అరెస్టు చేస్తారా అని అడిగినప్పుడు, మమ్దానీ .. తాము ఐసీసీ (అంతర్జాతీయ కోర్టు ) నుండి వారెంట్ ఎదుర్కొంటున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నామని, దాదాపు రెండు సంవత్సరాలుగా పాలస్తీనియన్లపై మారణహోమానికి పాల్పడిన వ్యక్తి గురించి తాను న్యూయార్క్ వాసుల నుండి ప్రతిచోటా వింటున్నానని తెలిపారు. ఎందుకంటే ఇది మానవత్వం యొక్క పవిత్రతపై ఏ రకమైన సార్వత్రిక నమ్మకానికైనా అవమానమన్నారు.

కానీ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు చట్టంపై అమెరికా సంతకం చేయలేదు. అంటే ఐసీసీకి అమెరికా భూభాగంలో ఎటువంటి అధికార పరిధి లేదు. కాబట్టి అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్‌ను అమలు చేయడానికి స్థానికంగా చేసే ఏ ప్రయత్నానికైనా అనేక అమెరికా చట్టాలు ఆటంకం కలిగిస్తాయి. అమెరికా రాజ్యాంగం ప్రభుత్వానికి విదేశీ వ్యవహారాలపై అధికారాన్ని ఇస్తుంది. ఈ అధికారాన్ని అమెరికన్ కోర్టులు పదే పదే సమర్థిస్తాయి. ఆచరణలో దీని అర్థం న్యూయార్క్ నగర అధికారులు నెతన్యాహును నిర్బంధించడానికి ప్రయత్నించినప్పటికీ, ప్రభుత్వ సంస్థలు ఈ చర్యను అధిగమించగలవు. దీంతో ఉత్కంఠ పెరుగుతోంది.
-
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఖమేనీ సంధి ఒప్పందం? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications