"ఓయ్ సెక్సీ.." అన్నందుకు అతన్ని దించేశారు..
కాలిఫోర్నియా : కాలిఫోర్నియా కేంద్రంగా నడిచే అలస్కా ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తి ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో.. అతన్ని విమానం నుంచి దింపివేశారు. అక్టోబర్ 9న ఈ ఘటన జరగ్గా.. తాజాగా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది అలస్కా ఎయిర్ లైన్స్.
కాగా, సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మరికొద్ది సేపట్లో విమానం బయలుదేరుతుందనగా.. 'ఓయ్ సెక్సీ' అంటూ ఎయిర్ హోస్టెస్ ను అసభ్యకర రీతిలో సంబోధించాడు సదరు ప్రయాణికుడు. దీంతో అతన్ని విమానం నుంచి దింపివేసినట్లుగా అలస్కా ఎయిర్ లైన్స్ వర్గాలు వెల్లడించాయి.

ఘటన అనంతరం దీనిపై ఓ మహిళా ప్రయాణికురాలు తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా సంబంధించింది. ఇద్దరు మహిళల మధ్య ఉన్న సీట్లో కూర్చోన్న అతగాడు ఆ ఇద్దరి పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె వివరించింది. 'ఓయ్ సెక్సీ' అంటూ సంబోధించినప్పుడు ఎయిర్ హోస్టస్ అతని వద్దకు వచ్చి సున్నితంగా మందలించిందని, అయినా తీరు మార్చుకోని అతగాడు.. 'జస్ట్ ఫన్ చేశాను.. ఇప్పుడు నిన్నో ఆటాడుకుంటా' అంటూ కామెంట్ చేశాడని ఫేస్ బుక్ పోస్టులో పేర్కొంది.
ఈ క్రమంలోనే విమాన సిబ్బంది అతన్ని కిందకు దించేశారని తెలిపింది. ఇదిలా ఉంటే విమాన సిబ్బందికి సంస్థ సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఘటన అనంతరం అలస్కా ఎయిర్ లైన్స్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications